వివాహేతర సంబంధానికి చిన్నారి బలి | Extramarital Affair in Vijayawada | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధానికి చిన్నారి బలి

May 6 2026 11:18 AM | Updated on May 6 2026 11:28 AM

Extramarital Affair in Vijayawada

సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్‌): వివాహేతర సంబంధం ముక్కుపచ్చలారని చిన్నారి హత్యకు కారణమైంది. వివాహితతో సహజీవనం చేస్తున్న వ్యక్తి ఆమె 18 నెలల కుమార్తెను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేసి నిదితున్ని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్నవరం, కోనయ్య చెరువు సమీపంలో నివాసం ఉండే తరుణ్‌ తాపీ పని చేసుకుంటూ భార్య ఆశాజ్వోతి, ఆరేళ్ల కొడుకు, 18 నెలల కూతురు హర్షితతో కలసి నివాసముంటున్నారు. 

ఈ క్రమంలో భర్త స్నేహితుడైన కనిజం వంశీతో ఆశాజ్యోతి వివాహేతర సంబంధం పెట్టుకుంది. నెల రోజుల క్రితం ఈ విషయం తెలియడంతో దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆశాజ్వోతి హర్షితను తీసుకుని వెళ్లిపోయింది. నగరంలోని వాంబేకాలనీలోని తన పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి వంశీతో కలసి విజయవాడ, బీఆరీ్టఎస్‌ రోడ్డు, రామకోటి మైదానం దగ్గరలోని ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటుంది. 

భర్త ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా తన పుట్టింట్లో ఉన్నట్లు చెబుతూ వస్తోంది. గత నెల 24న ఆమె గన్నవరంలోని భర్త ఇంటికి వెళ్ళి తన కొడుకుని కూడా తీసుకు వెళ్లిపోయింది. ఏప్రిల్‌ 29న పనికి వెళ్లే విషయంలో ఆశాజ్యోతికి వంశీకి మధ్య గొడవ జరిగింది. తీవ్ర కోపానికి గురైన వంశీ ఆడుకుంటున్న చిన్నారి హర్షితను తీవ్రంగా కొట్టాడు. పైకి ఎత్తి బలంగా గోడకేసి కొట్టడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం వంశీ అక్కడ నుంచి పరారయ్యాడు. ఆశాజ్వోతి తన భర్తకు ఫోన్‌ చేసి హర్షిత ఆరోగ్యం బాగోలేదని, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతోందని చెప్పింది. అనంతరం  వీడియో కాల్‌ చేసి హర్షిత కదలటం లేదని చెప్పింది.

 దీంతో తరుణ్‌ తన సోదరుడిని పంపి వారిని తీసుకురమ్మన్నాడు. అప్పటికే ఆశాజ్యోతి ఆటోలో చిన్నారిని తీసుకుని గన్నవరంలోని ఇంటికి వెళ్ళింది. చిన్నారి ఒంటిపై రక్తపు గాయాలు కనిపించడంతో తరుణ్‌ గన్నవరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో వంశీ తన చెల్లిని కొట్టి హత్య చేసినట్లు కుమారుడు తెలిపాడు. దీంతో పోలీసులు ఆమెను నిలదీయగా  అసలు విషయం చెప్పింది. దీంతో  పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఎస్‌ఎన్‌పురం పోలీసులకు బదిలీ చేశారు.  మంగళవారం వంశీని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.  

Advertisement
 
Advertisement
Advertisement