మచిలీపట్నంలో గంజాయి ముఠా అరెస్టు | - | Sakshi
Sakshi News home page

మచిలీపట్నంలో గంజాయి ముఠా అరెస్టు

May 12 2026 5:18 AM | Updated on May 12 2026 5:18 AM

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): జిల్లాకేంద్రమైన మచిలీపట్నంలో గంజాయి ముఠాను పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. వారి నుంచి పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మచిలీపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌చార్జ్‌ డీఎస్పీ జి.శ్రీనివాస్‌ ఈ కేసు వివరాలను విలేకరులకు తెలిపారు. ఆయన కథనం మేరకు.. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన గుంజా అజయ్‌బాబు, తురక ప్రవీణ్‌, కుంబా సాయిప్రసాద్‌, జవ్వాది తేజరామ్‌చరణ్‌, గట్టి సింహాద్రి, వాకా నిశాంత్‌, కందుల సుబ్రహ్మణ్యం, పయ్యావుల అజయ్‌యాదవ్‌తో పాటు బందరు మండలంలోని అరిశేపల్లికి చెందిన కాట్రగడ్డ జగదీష్‌సాయి, ఎస్‌.ఎన్‌.గొల్లపాలెంనకు చెందిన గురువిందపల్లి సుందర్‌, సత్రపాలెంనకు చెందిన వల్లభాపురం చందుప్రకాష్‌ పరిచయస్థులు. వీరు కొంత కాలంగా రెండు బృందాలుగా మచిలీపట్నంలోని పలు ప్రాంతాల్లో గంజాయి తాగడంతోపాటు, విక్రయిస్తున్నారు. వారిపై గతంలో అనేక కేసులు నమోదయ్యాయి. సోమవారం నగరానికి సమీపంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన నిర్మానుష్య ప్రాంతంలో వారు గంజాయి తాగుతూ విక్రయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వెంటనే ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ బందరు ఇన్‌చార్జ్‌ డీఎస్పీ శ్రీనివాసర్‌ పర్యవేక్షణలో ఆర్‌పేట సీఐ ఏసుబాబు ఆధ్వర్యంలో దాడులు చేయించారు. ఈ దాడుల్లో మచిలీపట్నం ఎస్‌ఐతో పాటు ఆర్‌పేట ఎస్‌ఐలు పాల్గొనగా 11 మంది యువకులు గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారు. వారి నుంచి పది కిలోల గంజాయి, ఆరు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో ఆర్‌పేట సీఐ ఏసుబాబు, మచిలీపట్నం, ఆర్‌పేట ఎస్‌ఐలు జగదీష్‌కుమార్‌, కె.సూర్యప్రకాష్‌, ఎకై ్సజ్‌ సీఐ వరస వెంకటేశ్వరమ్మ, ఈగల్‌ టీం సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement