దుర్గమ్మకు పలువురు భక్తుల విరాళాలు | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మకు పలువురు భక్తుల విరాళాలు

May 15 2026 12:19 PM | Updated on May 15 2026 12:19 PM

దుర్గమ్మకు పలువురు భక్తుల విరాళాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు పలువురు భక్తులు గురువారం విరాళాలను సమర్పించారు. అమ్మవారి నిత్యాన్నదానానికి విజయవాడ మొగల్‌రాజపురానికి చెందిన ఆకుల వెంకట కృష్ణ కిశోర్‌, జ్యోతి రూ. 1,00,116, గుంటూరు తాడేపల్లి ఉండవల్లికి చెందిన కొండా బాల ప్రదీప్‌, విజయశాంతి దంపతులు రూ. 1,00,116 విరాళాన్ని అందజేశారు. విజయవాడ భవానీపురానికి చెందిన బొచ్చు పవన్‌ వెంకట నాగ రాజేష్‌ కుటుంబం అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులకు రూ. 1,00,116 విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ చైర్మన్‌ రాధాకృష్ణ, ఆలయ అధికారులు, అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ఉత్సాహంగా మెన్‌ అండ్‌ ఉమెన్‌ చెస్‌ టోర్నీ మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): చెస్‌ను ఆడటం వల్ల మనిషి మెదడు చురుకుదనం పెరిగి ఎల్లప్పుడు ఉత్సాహంగా ఉంటారని నెక్ట్స్‌జెన్‌ సీబీఎస్‌ఈ స్కూల్‌ సీఈవో గౌతమి చెప్పారు. స్థానిక గుణదలలోని నెక్ట్స్‌జెన్‌ సీబీఎస్‌ఈ స్కూల్‌ ఆవరణలో ఎన్టీఆర్‌ జిల్లా మెన్‌ అండ్‌ ఉమెన్‌ చెస్‌ టోర్నమెంట్‌ గురువారం జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 52 మంది ఈ టోర్నీలో పాల్గొన్నారు. మొత్తం ఐదు రౌండ్లలో జరిగిన పోటీల్లో చెస్‌ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బాలుర విభాగంలో వై.రాజేష్‌, ఏ.శశాంక్‌, టి.నిచల్‌, సాత్విక్‌ రెడ్డి, డి.రోషన్‌, బాలికల విభాగంలో వై.నిచ్ఛల, రిషిత, ఎస్‌కే అప్షన్‌, ఎస్‌.వివేకా, సౌమిక చౌదరి విజేతలకు నిలిచారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి గౌతమి హాజరై విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఎన్టీఆర్‌ జిల్లా చెస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి పి.రేణుక మాట్లాడుతూ ఈ టోర్నమెంట్‌లో ప్రతిభ చూపిన క్రీడాకారులు ఈ నెల 27 తేదీన చీరాలలో జరిగే ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లెవల్‌ మెన్‌ అండ్‌ ఉమెన్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ పోటిల్లో ఎన్టీఆర్‌ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. చీఫ్‌ ఆర్బిటర్స్‌ పి.రవీంధ్ర, ఏ. మణిరత్నం పాల్గొన్నారు. సుబ్బారాయుడికి రూ. 6.61లక్షల ఆదాయం ‘పది’లో ప్రతిభావంతులకు సత్కారం

మోపిదేవి: కృష్ణాజిల్లా మోపిదేవిలోని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానానికి చెందిన నూతన షాపింగ్‌ కాంప్లెక్స్‌లో షాపుల బహిరంగ వేలం ఆలయ ప్రాంగణంలో గురువారం నిర్వహించారు. రెండేళ్ల కాలపరిమితికి ఈ వేలం పాట నిర్వహించగా మొత్తం పది షాపులకు గాను రూ. 6,61,000 ఆదాయం సమకూరినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్‌ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. మొత్తం పది షాపులగానూ ఈ ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. మచిలీ పట్నం డివిజన్‌ తనిఖీ అధికారి కె. శ్రీనివాసరావు, ఆలయ సూపరిటెండెంట్‌ అచ్యుత మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.

మంగళగిరి టౌన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు గురువారం మంగళగిరి పరిధిలోని సీకే కన్వెన్షన్‌లో సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ముఖ్య అతిథిగా హాజరై 65 మంది విద్యార్థులకు రూ. 5 వేల చొప్పున నగదు ప్రోత్సాహకం, లెదర్‌ బ్యాగ్‌, పెన్నులతోపాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్‌, ఏలూరు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆయా జిల్లాలో మొదటి పది స్థానాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. లిడ్‌క్యాప్‌ చైర్మన్‌ మాణిక్యాలరావు, ఆర్‌జేడీ నాగమణి, డీఈవోలు సలీంబాషా, శ్రీనివాసరావు, రామారావు, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement