
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చోటు దక్కకపోయిన సంగతి తెలిసిందే. జడ్డూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికి సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకోకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.
గతేడాది టీ20లకు వీడ్కోలు పలికిన జడేజా.. ప్రస్తుతం వన్డే, టెస్టు ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2009 నుంచి భారత్ తరఫున వన్డే క్రికెట్ ఆడుతున్న జడేజా అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా నిలిచాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకోవడంలోనూ అతడు కీలక పాత్ర పోషించాడు.
ప్రస్తుతం విండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ ఈ సౌరాష్ట్ర క్రికెటర్ అదరగొడుతున్నాడు. ఫిట్‌నెస్ పరంగా కూడా అతడు చాలా మెరుగ్గా ఉన్నాడు. ఆసీస్ సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంతో వన్డే ప్రపంచ కప్-2027లో జడేజా ఆడుతాడో లేదో సందిగ్ధంగా మారింది. అయితే బీసీసీఐ చీఫ్ సెలక్టర్ మాత్రం జడేజా తమ ప్రణాళిలకలలో ఉన్నాడని జట్టు ప్రకటన సందర్భంగా చెప్పుకొచ్చాడు. తాజాగా జడేజా కూడా ప్రపంచకప్‌లో ఆడాలన్న తన కోరికను వ్యక్తం చేశాడు.
"వన్డే ప్రపంచ కప్-2027లో ఆడాలనుకుంటున్నాను. కానీ అది నా చేతుల్లో లేదు. సెలక్షన్ కమిటీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఆసీస్ టూర్‌కు జట్టు ఎంపికకు ముందు సెలక్టర్లు, కెప్టెన్ నాతో మాట్లాడారు. వారి చెప్పిన కారణాలు నాకు అర్థమయ్యాయి. కానీ వన్డే ప్రపంచకప్ గెలవడం మా అందరి కల" అని జడేజా విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు.
చదవండి: అది నేను ఎప్పటికీ మర్చిపోలేను: గంభీర్