
గౌతమ్ గంభీర్.. టీమిండియా హెడ్‌కోచ్‌గా వైట్ బాల్ క్రికెట్‌లో విజయవంతమైనప్పటికి.. సంప్రాదాయ ఫార్మాట్‌లో ఇంకా తన మార్క్ చూపించలేదు. టీ20 వరల్డ్‌కప్-2024 విజయం రాహుల్ ద్రవిడ్ వారుసుడిగా బాధ్యతలు చేపట్టిన గంభీర్‌కు ఆరంభంలోనే ఘోర పరాభావం ఎదురైంది.
సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ వైట్ వాష్‌కు గురైంది. 1933లో టీమిండియా స్వదేశంలో తమ తొలి టెస్టు మ్యాచ్ ఆడినప్పటి నుంచి మూడు లేదా అంతకంటే ఎక్కువ టెస్టులు ఉన్న సిరీస్‌లో వైట్ వాష్ అవ్వడం ఇదే తొలిసారి.
ఈ ఘోర ఆ ప్రతిష్టను భారత జట్టు గంభీర్ కోచింగ్‌లో మూటకట్టుకోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ట్రోఫీలోనూ టీమిండియా దారుణ ప్రదర్శన కనబరిచింది. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 3-1 తేడాతో భారత్ కోల్పోయింది.
దీంతో గంభీర్‌ను కోచ్ పదవి నుంచి తప్పించాలని చాలా మంది మాజీలు సూచించారు. అయితే ఆ తర్వాత భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సమం చేయడంతో గంభీర్‌ను విమర్శించే వాళ్ల సంఖ్య కాస్త తగ్గింది. ఇటీవలే ఆసియాకప్‌ను కూడా భారత్ సొంతం చేసుకుంది.
ప్రస్తుతం టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌తో తలపడుతోంది. ఇప్పటికే తొలి టెస్టులో విజయం సాధించిన గిల్ సేన.. ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ విజయం దిశగా సాగుతోంది. అయితే రెండో రోజు ఆట సందర్భంగా గౌతమ్ గంభీర్ అధికారిక బ్రాడ్‌క్రాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌కు గౌతీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా కివీస్ సిరీస్ వైట్‌వాష్ కావడంపై అతడు స్పందించాడు.
"న్యూజిలాండ్‌తో సిరీస్‌ను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ఓటమిని మా బాయ్స్‌కు ఇప్పటికి గుర్తు చేస్తూనే ఉంటాను. ఎందుకంటే కొన్నిసార్లు గతాన్ని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఏ జట్టును కూడా తేలికగా తీసుకూడదని నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను. న్యూజిలాండ్‌ను ఈజీగా ఓడించగలమని అందరూ అనుకున్నారు.
కానీ ఊహించని ఫలితం మాకు ఎదురైంది. నేను కోచ్‌గా ఉన్న లేకపోయినా న్యూజిలాండ్‌పై ఓటమిని డ్రెస్సింగ్ రూమ్ ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది. ఆ అనుభవం భవిష్యత్తులో జట్టుకు ఎంగతగానో ఉపయోగపడుతోంది" అని గంభీర్ పేర్కొన్నాడు.