
ఐపీఎల్-2026 సీజన్ మినీ వేలాన్ని భారత్‌లో నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భావిస్తున్నట్లు సమాచారం. గత రెండు సీజన్లకు సంబంధించిన వేలాన్ని దుబాయ్, సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా కండక్ట్ చేశారు.
క్రిక్‌బజ్ రిపోర్ట్ ప్రకారం.. మళ్లీ ఇప్పుడు మూడేళ్ల తర్వాత ఈ క్యాష్‌రిచ్ వేలాన్ని భారత్‌కు తిరిగి తీసుకొచ్చేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు సమాచారం. ఇంకా ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ త్వరలోనే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ (GC) దీనిపై సమావేశం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అదేవిధంగా ఈ మినీ అక్షన్‌ను డిసెంబర్ 13 నుండి 15 మధ్య నిర్వహించే అవకాశముందని పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అయితే గతేడాది మాత్రం బోర్డర్-గావస్కర్ ట్రోఫీ షెడ్యూల్, అప్పటి బీసీసీఐ కార్యదర్శి జై షా విదేశీ పర్యటన కారణంగా కాస్త ముందుగానే(నవంబర్ 24, 25 తేదీల్లో) వేలం జరిగింది.
కాగా ఐపీఎల్ వేలం ఇప్పటివరకు ఎక్కువసార్లు బెంగళూరులోనే జరిగింది. మొత్తం 7 సార్లు ఈ గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అక్షన్ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చింది. అయితే గత కొన్ని ఐపీఎల్ సీజన్లలో అహ్మదాబాద్ అత్యంత ప్రాధాన్యతగల వేదికగా అవతరించింది.
2022లో గుజరాత్ టైటాన్స్ (GT) జట్టు అరంగేట్రం నుంచి గత నాలుగు ఐపీఎల్ ఫైనల్స్‌లో అహ్మదాబాద్ వేదికగానే జరిగింది. దీంతో ఈసారి బీసీసీఐ మినీ వేలాన్ని మొదటిసారిగా అహ్మదాబాద్‌లో నిర్వహించే అవకాశం ఉందని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటివరకు ఐపీఎల్ వేలం జరిగిన వేదికలు
🔹 2008 – ముంబై
🔹 2009 – గోవా
🔹 2010 – బెంగళూరు
🔹 2011 – బెంగళూరు
🔹 2012 – బెంగళూరు
🔹 2013 – చెన్నై
🔹 2014 – బెంగళూరు
🔹 2015, 2016, 2017, 2018 – బెంగళూరు
.
🔹 2019 – జైపూర్
🔹 2020 – కోల్‌కతా
🔹 2021 – చెన్నై
🔹 2022 – బెంగళూరు
🔹 2023 – దుబాయ్ (UAE)
🔹 2024 – జెడ్డా (సౌదీ అరేబియా)
చదవండి: గెలుపు వాకిట్లో భారత్