ఆసీస్‌తో టీ20 సిరీస్‌.. భార‌త జ‌ట్టులో కీల‌క మార్పు | Kuldeep Yadav released from Indias T20I squad in the middle of Australia series | Sakshi
Sakshi News home page

IND vs AUS T20 Series: ఉన్న‌ప‌ళంగా స్వ‌దేశానికి టీమిండియా స్టార్ క్రికెట‌ర్‌

Nov 2 2025 9:10 PM | Updated on Nov 2 2025 9:23 PM

Kuldeep Yadav released from Indias T20I squad in the middle of Australia series

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత టీ20 జట్టులో ఓ కీలక మార్పు చోటు చేసుకుంది. ఆసీస్ మిగిలిన రెండు టీ20కు ముందు జట్టు నుంచి స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను బీసీసీఐ రిలీజ్ చేసింది. 30 ఏళ్ల కుల్దీప్ స్వ‌దేశానికి వ‌చ్చి ద‌క్షిణాఫ్రికా-తో జ‌రగ‌నున్న రెండో అనాధిక‌రిక టెస్టులో ఇండియా-ఎ జ‌ట్టు త‌ర‌పున ఆడ‌నున్నాడు. 

దక్షిణాఫ్రికాతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు ఈ మ్యాచ్‌ కుల్దీప్‌కు ప్రాక్టీస్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని బోర్డు భావించింది.  ఈ క్ర‌మంలోనే జ‌ట్టు నుంచి యాద‌వ్‌ను బీసీసీఐ విడుద‌ల చేసింది. "బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో దక్షిణాఫ్రికా-ఎతో జ‌ర‌గ‌నున్న రెండో టెస్టులో కుల్దీప్ పాల్గోనున్నాడు. భార‌త జ‌ట్టు మెనెజ్‌మెంట్ అభ్య‌ర్ధ‌న మెర‌కు ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న టీ20 సిరీస్ నుంచి కుల్దీప్‌ను రిలీజ్ చేశాము" అని భార‌త క్రికెట్ బోర్డు ఓ ప్రక‌ట‌న‌లో పేర్కొంది. 

కాగా ఆసీస్‌తో తొలి రెండు మ్యాచ్‌లలో ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగమైన కుల్దీప్‌.. మూడో టీ20కి మాత్రం బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. ఇప్పుడు ఏకంగా జ‌ట్టు నుంచి బ‌య‌టకు వ‌చ్చేశాడు. ఇక ఆదివారం హోబ‌ర్ట్ వేదిక‌గా జ‌రిగిన మూడో టీ20లో 5 వికెట్ల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-1తో స‌మం చేసింది.

ఆసీస్‌తో సిరీస్ కోసం అప్‌డేట‌డ్ భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్‌), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్‌), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, సంజూకు రష్‌దీప్ సింగ్, సంజూకు వాషింగ్టన్ సుందర్.

దక్షిణాఫ్రికా -ఎతో జరిగే  టెస్టుకు భార‌త‌-ఎ జ‌ట్టు
రిషబ్ పంత్ (కెప్టెన్‌) , కేఎల్‌ రాహుల్, ధృవ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్‌), దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సుతార్, ఇ, ఖులీల్, అబ్ర్మేద్యు, ఖులీల్, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, కుల్దీప్ యాదవ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement