
ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా గుడ్ న్యూస్ అందింది. యువ ఆటగాడు సాయి సుదర్శన్ గాయం తీవ్రతపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) వైద్య బృందం అప్‌డేట్ ఇచ్చింది. అతడి గాయం అంత తీవ్రమైనది కాదని మెడికల్ టీమ్ వెల్లడించింది.
సుదర్శన్ ప్రస్తుతం వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. అయితే ముందు జాగ్రత్త చర్యగా మూడో రోజు ఆటకు కూడా ఈ తమిళనాడు బ్యాటర్ దూరంగా ఉండనున్నాడు. రెండో రోజు ఆట సందర్భంగా సుదర్శన్ గాయపడిన సంగతి తెలిసిందే.
అసలేమి జరిగిందంటే?
రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఔట్‌సైడ్ ఆఫ్ దిశగా పడిని విండీస్ ఓపెనర్ క్యాంప్‌బెల్ బలంగా స్వీప్ చేశాడు. ఈ క్రమంలో షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సుదర్శన్ బంతి నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. కానీ ఆ బంతి నేరుగా అతని చేతుల్లోకి వెళ్లడం , ఆ వేగంలో కూడా సుదర్శన్ విడిచిపెట్టుకుండా అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.
ఈ క్యాచ్‌ను అందుకునే క్రమంలో బంతి అతడి చిటికెన వేలు తాకింది. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి అతడు నొప్పి తగ్గలేదు. దీంతో ఫిజియో సాయంతో అతడు మైదానాన్ని వీడాడు. అతడి స్దానంలో సబ్‌స్ట్యూట్‌గా దేవదత్త్ పడిక్కల్ ఫీల్డింగ్ చేస్తున్నాడు. అయితే బ్యాటింగ్‌కు సుదర్శన్ వస్తాడో రాడో ఇంకా క్లారిటీ లేదు.
అయితే వెస్టిండీస్ మాత్రం తమ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్‌కు చేరువైంది. 209 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే విండీస్ ఫాలో ఆన్ గండం తప్పించుకునేటట్లు కన్పించడం లేదు. విండీస్ ఫాల్ ఆన్‌కు ఇంకా 105 పరుగుల వెనుకంజలో ఉంది.
చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 65 ఏళ్లలో ఇదే తొలిసారి