మూసీ భూ సేకరణలో న్యాయం చేస్తాం | - | Sakshi
Sakshi News home page

మూసీ భూ సేకరణలో న్యాయం చేస్తాం

Feb 20 2026 11:08 AM | Updated on Feb 20 2026 11:08 AM

మూసీ భూ సేకరణలో న్యాయం చేస్తాం

మూసీ భూ సేకరణలో న్యాయం చేస్తాం

రైతులకు ఆర్డీఓ హామీ

శాస్త్రిపురం: మూసీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు కోసం సేకరించే భూములకు సంబంధించి ప్రతి రైతుకూ న్యాయం చేస్తామని రాజేంద్రనగర్‌ ఆర్డీఓ వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం హైదర్‌గూడలో మూసీ డెవలప్‌మెంట్‌ గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాము కోల్పోయిన భూములకు నష్ట పరిహారంగా భూములే ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేశారు. వ్యవసాయ భూముల్లో కాయగూరలు, ఆకుకూరలు పండించుకుంటున్నామని, తమకు న్యాయం చేయాలని ఆర్డీవో వెంకట్‌రెడ్డికి రైతులు విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఆయన.. ప్రతి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement