త్వరలో ‘టాటా–అంబేడ్కర్‌ శిక్షణ కేంద్రం’ | - | Sakshi
Sakshi News home page

త్వరలో ‘టాటా–అంబేడ్కర్‌ శిక్షణ కేంద్రం’

Feb 20 2026 11:03 AM | Updated on Feb 20 2026 11:03 AM

త్వరలో ‘టాటా–అంబేడ్కర్‌ శిక్షణ కేంద్రం’

త్వరలో ‘టాటా–అంబేడ్కర్‌ శిక్షణ కేంద్రం’

బంజారాహిల్స్‌: ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థలకు దీటుగా అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థులు పోటీ పడుతున్నారని, రానున్న రోజుల్లో ‘టాటా–అంబేడ్కర్‌ శిక్షణ కేంద్రం’ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వైస్‌ చాన్సలర్‌ ఘంటా చక్రపాణి వెల్లడించారు. టీసీఎస్‌ అయాన్‌ భాగస్వామ్య కంపెనీల ద్వారా ఎంపికై న 64 మందికి గురువారం విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని సీఎస్‌టీడీ భవనం ఆడిటోరియంలో జాబ్‌ ఆఫర్‌ లెటర్లను అందజేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ... దేశంలోని ప్రముఖ విద్యా సంస్థలకు దీటుగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం పోటీపడుతుందన్నారు. ఉద్యోగ అవకాశాలను పెంపొందించడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌)తో కలిసి ఓ ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాన్ని ‘టాటా–అంబేడ్కర్‌’ పేరిట ఏర్పాటు చేయాలనే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అకడమిక్‌ డైరెక్టర్‌ పుష్ప చక్రపాణి, ఓఎస్‌డీ రవీంద్రనాథ్‌ సోలమన్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement