
Update: కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నీ-2024 విజేతగా అర్జెంటీనా నిలిచింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన ఫైనల్లో కొలంబియాను 1-0 తేడాతో ఓడించిన అర్జెంటీనా.. 16వ సారి కోపా అమెరికా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్, కెప్టెన్ లియోనెల్ మెస్సీ కన్నీరు పెట్టుకున్నాడు. కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నీలో భాగంగా కొలంబియాతో జరుగుతున్న ఫైనల్లో మెస్సీ గాయపడ్డాడు. మ్యాచ్ 36వ నిమిషంలో మెస్సీ చీలమండ(పాదం)కు గాయమైంది.
దీంతో అతడు తీవ్రమైన నొప్పితో మైదానంలో కింద పడిపోయాడు. ఆ తర్వాత ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. కొంచెం కూడా ఉపశమనం లభించలేదు. అయినప్పటకి మెస్సీ మైదానాన్ని వీడకుండా తన ఆటను కొనసాగించాడు. మ్యాచ్ హాఫ్-టైమ్ తర్వాత కూడా స్కోర్‌లేకుండా పోవడంతో తీవ్రమైన నొప్పిని భరిస్తూనే మెస్సీ తన కంటిన్యూ చేశాడు.
అయితే నొప్పి మరింత తీవ్రం కావడంతో మ్యాచ్ 66వ నిమిషంలో మెస్సీ గాయం కారణంగా మైదానం నుండి బయటకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో డగౌట్‌లో కూర్చోన్న మెస్సీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన కెరీర్‌లో చివరి కోపా అమెరికా ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతున్న ఈ అర్జెంటీనా స్టార్ వెక్కి వెక్కి ఏడ్చాడు.
అయితే అభిమానులు మాత్రం అతడికి మద్దతుగా నిలిచారు. మెస్సీ, మెస్సీ అంటూ జేజేలు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరు జట్లు గోల్స్ సాధించలేకపోయాయి.
ప్రస్తుతం 25 నిమిషాలు ఎక్స్‌ట్రా సమయం కేటాయించారు. అదనపు సమయంలో 15 నిమిషాలు ముగిసినప్పటకి ఇరు జట్లు గోల్స్ సాధించడంలో విఫలమయ్యా. ఆఖరి 10 నిమిషాల్లో గోల్స్ రాకపోతే ఈ మ్యాచ్ ఫలితాన్ని పెనాల్టీ షూట్ అవుట్‌లో తేల్చే అవకాశముంది.
Messi is in tears as he is subbed off due to injury 💔 pic.twitter.com/t0l3OLLuWf
— FOX Soccer (@FOXSoccer) July 15, 2024