పల్లెకు పరిచయమైన "వర్చువల్‌ రియాలిటీ గేమింగ్‌".. స్పందన మామూలుగా లేదు..! | Few Youngsters Opened A Virtual Reality Gaming Centre In Karnataka Village, Response Was Overwhelming | Sakshi
Sakshi News home page

పల్లెకు పరిచయమైన "వర్చువల్‌ రియాలిటీ గేమింగ్‌".. స్పందన మామూలుగా లేదు..!

Jul 15 2025 1:51 PM | Updated on Jul 15 2025 2:51 PM

Few Youngsters Opened A Virtual Reality Gaming Centre In Karnataka Village, Response Was Overwhelming

వర్చువల్‌ రియాలిటీ గేమింగ్‌ (VR Gaming) అనేది గేమింగ్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చిన సాంకేతికత. ఇది ఆటగాళ్లను త్రిమితీయ (3D) వాతావరణంలోకి తీసుకెళ్లి, నిజంగానే ఆ ప్రపంచంలో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. 

ఈ క్రీడలను VR హెడ్‌సెట్, మోషన్ కంట్రోలర్‌ లాంటి సాధనాలను ఉపయోగించి ఆడతారు. VR Gamingను కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా విద్య, శిక్షణ, వైద్య రంగాల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని పెద్దపెద్ద నగరాల్లో మాత్రమే ఈ VR Gaming సెంటర్లు వెలిశాయి.

అయితే, ఇటీవల కర్ణాటకలోని హసన్‌ జిల్లాకు కొందరు ఔత్సాహిక యువకులు ఈ VR Gamingను ఓ మారుమూల పల్లెకు పరిచయం చేశారు. టెక్నాలజీ అంటే ఏమిటో తెలియని ఆ పల్లె ప్రజలు ఈ కాల్పనిక క్రీడలను తెగ ఎంజాయ్‌ చేశారు. సదరు యువత ఇచ్చిన Meta Quest VR Headsetలను ధరించి నిజంకాని ప్రపంచంలోకి వెళ్లిపోయారు.

పిల్లలు, మహిళలు, వృద్దులు అన్న తేడా లేకుండా ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరు VR Gamingతో కలిగిన కొత్త అనుభూతిని ఆస్వాధించారు. VR Gaming ద్వారా బాక్సింగ్‌, బిల్డింగ్‌పై నడవడం లాంటి కాల్పనిక క్రీడలను ఆడారు. ఈ VR Gaming కేంద్రానికి విశేషమైన స్పందన రావడంతో సదరు యువకులు దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోకు కూడా విపరీతమైన స్పందన వస్తుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement