కోపా అమెరికా కప్‌ విజేతగా అర్జెంటీనా.. మెస్సీకి గిఫ్ట్‌ | Argentina Clinch Copa America Title With 1-0 Win | Sakshi
Sakshi News home page

Copa America 2024: కోపా అమెరికా కప్‌ విజేతగా అర్జెంటీనా.. మెస్సీకి గిఫ్ట్‌

Published Mon, Jul 15 2024 10:06 AM | Last Updated on Mon, Jul 15 2024 12:47 PM

Argentina Clinch Copa America Title With 1-0 Win

కోపా అమెరికా ఫుట్‌ బాల్‌ టోర్నీ-2024 విజేతగా అర్జెంటీనా నిలిచింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన ఫైనల్లో కొలంబియాను 1-0 తేడాతో ఓడించిన అర్జెంటీనా.. 16వ సారి కోపా అమెరికా కప్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

ఈ మ్యాచ్‌ ఆఖరివరకు ఉత్కంఠ భరితంగా సాగింది. నిర్ణీత సమయంలో మ్యాచ్‌ ఫలితం తేలకపోవడంతో 30 నిమిషాలు ఆదనపు సమయం కేటాయించారు. ఎక్స్‌ట్రా సమయం కూడా ముగుస్తుండడంతో  ఈ మ్యాచ్‌ పెనాల్టీ షుట్‌ అవుట్‌కు దారి తీస్తుందని అంతా భావించారు. 

సరిగ్గా ఇదే సమయంలో అర్జెంటీనా సబ్‌స్టిట్యూట్‌ స్ట్రైకర్‌ లౌటారో మార్టినెజ్‌ అద్భుతం చేశాడు. 112వ నిమిషంలో గోల్‌ కొట్టిన మార్టినెజ్‌.. తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మిగిలిన 8 నిమిషాల్లో  కొలంబియా గోల్‌ సాధించకపోవడంతో అర్జెంటీనా టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.

 

 

కాగా అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌, కెప్టెన్‌ లియోనెల్‌ మెస్సీకి ఇదే ఆఖరి కోపా అమెరికా కప్‌ కావడం గమనార్హం. దీంతో అతడికి తన సహచరులు అద్భుతమైన విజయంతో విడ్కోలు పలికారు. ఈ మ్యాచ్‌లో గాయపడిన మెస్సీ మ్యాచ్‌ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. అనంతరం కన్నీరు పెట్టుకున్నాడు. అయితే ఇప్ప్పుడు తన జట్టు విజయం సాధించడంతో మెస్సీఆనందంలో మునిగి తేలుతున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement