
క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించిన స్వియాటెక్, బెన్‌చిచ్
లండన్: ఐదు గ్రాండ్‌స్లామ్ టోర్నీ టైటిల్స్ విజేత ఇగా స్వియాటెక్ (పోలాండ్) ఆరో ప్రయత్నంలో... ప్రపంచ మాజీ నాలుగో ర్యాంకర్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్) తొమ్మిదో ప్రయత్నంలో... తొలిసారి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు అర్హత సాధించారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ స్వియాటెక్ 6–2, 7–5తో 19వ ర్యాంకర్ సమ్సోనోవా (రష్యా)పై... 35వ ర్యాంకర్ బెన్‌చిచ్ 7–6 (7/3), 7–6 (7/2)తో 7వ ర్యాంకర్ మిరా ఆంద్రీవా (రష్యా)పై గెలుపొందారు.
సెమీస్‌లో సినెర్‌తో జొకోవిచ్ ‘ఢీ’
పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ), ఏడుసార్లు చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ సినెర్ 2 గంటల 19 నిమిషాల్లో 7–6 (7/2), 6–4, 6–4తో పదో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా)ను ఓడించగా... జొకోవిచ్ 3 గంటల 11 నిమిషాల్లో 6–7 (6/8), 6–2, 7–5, 6–4తో 22వ సీడ్ ఫ్లావియా కొ»ొల్లి (ఇటలీ)పై విజయం సాధించారు. రేపు జరిగే సెమీఫైనల్స్‌లో అల్‌కరాజ్ (స్పెయిన్)తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా); సినెర్‌తో జొకోవిచ్ తలపడతారు.