breaking news
Belinda Bencic
-
తొలిసారి సెమీస్‌లోకి...
లండన్: ఐదు గ్రాండ్‌స్లామ్ టోర్నీ టైటిల్స్ విజేత ఇగా స్వియాటెక్ (పోలాండ్) ఆరో ప్రయత్నంలో... ప్రపంచ మాజీ నాలుగో ర్యాంకర్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్) తొమ్మిదో ప్రయత్నంలో... తొలిసారి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు అర్హత సాధించారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ స్వియాటెక్ 6–2, 7–5తో 19వ ర్యాంకర్ సమ్సోనోవా (రష్యా)పై... 35వ ర్యాంకర్ బెన్‌చిచ్ 7–6 (7/3), 7–6 (7/2)తో 7వ ర్యాంకర్ మిరా ఆంద్రీవా (రష్యా)పై గెలుపొందారు. సెమీస్‌లో సినెర్‌తో జొకోవిచ్ ‘ఢీ’ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ), ఏడుసార్లు చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ సినెర్ 2 గంటల 19 నిమిషాల్లో 7–6 (7/2), 6–4, 6–4తో పదో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా)ను ఓడించగా... జొకోవిచ్ 3 గంటల 11 నిమిషాల్లో 6–7 (6/8), 6–2, 7–5, 6–4తో 22వ సీడ్ ఫ్లావియా కొ»ొల్లి (ఇటలీ)పై విజయం సాధించారు. రేపు జరిగే సెమీఫైనల్స్‌లో అల్కరాజ్ (స్పెయిన్)తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా); సినెర్‌తో జొకోవిచ్ తలపడతారు. -
Canadian Open: తొలి రౌండ్లోనే సెరెనా అవుట్
టొరంటో: కెరీర్‌కు త్వరలోనే గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమైన అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ ఆ ప్రకటన తర్వాత ఆడిన మొదటి టోర్నీలోనే పేలవ ప్రదర్శన కనబర్చింది. కెనడియన్ ఓపెన్‌లో ఆమె ఆట తొలి రౌండ్లోనే ముగిసింది. మహిళల సింగిల్స్ పోరులో 2–6, 4–6తో బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్) చేతిలో సెరెనా పరాజయం చవిచూసింది. ఇక్కడ మూడు సార్లు చాంపియన్‌గా నిలిచిన సెరెనా ఓటమితో ఈవెంట్‌కు గుడ్‌బై చెప్పింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘భావోద్వేగం వల్లే మాటరాని మౌనంతో బరువెక్కిన హృదయంతో నిష్క్రమించాను. నిజానికి ఈ మ్యాచ్‌లో నేను బాగా ఆడాలని సన్నద్ధమై వచ్చాను. కానీ నాకంటే బెలిండా చాలా బాగా ఆడింది. ఇంత మంది అభిమానుల మధ్య నా సుదీర్ఘ కెరీర్ సాగింది. ఇది ఎప్పటికీ ప్రత్యేకం’ అని సెరెనా ఉద్వేగంతో తెలిపింది. -
మూడో రౌండ్లో బెన్సిక్, ప్లిస్కోవా
సీడెడ్ ప్లేయర్లు తమ జోరు కొనసాగించారు. ఆరంభ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఎలాంటి సంచలనానికి తావివ్వకుండా నాలుగో రోజు ఆటను ముగించారు. రెండో సీడ్ ప్లిస్కోవా, నాలుగో సీడ్ హలెప్, ఆరో సీడ్ బెన్సిక్ అలవోక విజయాలతో మూడో రౌండ్లోకి ప్రవేశించారు. మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ఈసారి టైటిల్‌పై కన్నేసిన కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) మరో సునాయాస విజయంతో రెండో రౌండ్‌ను దాటేసింది. 2018 రన్నరప్ హలెప్ (రొమేనియా) కూడా వరుస సెట్లలోనే ప్రత్యర్థిని ఓడించింది. స్విట్జర్లాండ్ స్టార్, ఆరో సీడ్ బెలిండా బెన్సిక్ మాజీ ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఒస్లాపెంకోను కంగుతినిపించగా... పురుషుల సింగిల్స్‌లో నంబర్‌వన్ నాదల్కు రెండో సెట్లో గట్టీపోటీ ఎదురైనా మ్యాచ్‌ను మాత్రం మూడు సెట్లలోనే ముగించాడు. మాజీ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) మూడో రౌండ్ చేరేందుకు ఐదు సెట్లు పోరాడాల్సి వచి్చంది. అమ్మయ్యాక తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గాయంతో ని్రష్కమించింది. ఒస్టాపెంకోకు మళ్లీ నిరాశే మహిళల సింగిల్స్‌లో జెలీనా ఒస్టాపెంకోకు ఆ్రస్టేలియా ఓపెన్‌లో మళ్లీ నిరాశ ఎదురైంది. 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ అయిన లాతి్వయా స్టార్ ఇక్కడ ఒకటి లేదంటే మూడో రౌండ్లలో ని్రష్కమించేది. తాజాగా ఆరో సీడ్ బెన్సిక్ (స్విట్జర్లాండ్) చేతిలో రెండో రౌండ్లో ఓడింది. స్విస్ క్రీడాకారిణి 7–5, 7–5తో ఒస్టాపెంకో ఆట ముగించింది. మిగతా మ్యాచ్‌ల్లో ప్లిస్కోవా 6–3, 6–3తో లౌర సీగెమండ్ (జర్మనీ)పై, హలెప్ 6–2, 6–4తో ఇంగ్లండ్ క్వాలిఫయర్ హరియెట్ డార్ట్‌పై, 17వ సీడ్ కెర్బెర్ (జర్మనీ) 6–3, 6–2తో ప్రిసిలా హాన్ (ఆ్రస్టేలియా)పై పోటీలేని విజయాలు సాధించి ముందంజ వేశారు. ఐదో సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) 6–2, 7–6 (8/6)తో డావిస్ (అమెరికా)ను ఓడించగా.. మాజీ ప్రపంచ నంబర్‌వన్ ముగురుజ 6–3, 3–6, 6–3తో అజ్లా టాంజనోవిక్ (ఆ్రస్టేలియా)పై విజయం సాధించింది. మూడో రౌండ్లో నాదల్ గత ఆ్రస్టేలియన్ ఓపెన్ రన్నరప్, టైటిల్ ఫేవరెట్లలో ఒకడైన టాప్‌సీడ్ స్పానిష్ దిగ్గజం రాఫెల్ నాదల్ మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో అతను 6–3, 7–6 (7/4), 6–1తో డెల్బొనిస్ (అర్జెంటీనా)ను ఓడించాడు. 19 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత అయిన నాదల్ ఇక్కడ మాత్రం ఒక్కసారి మాత్రమే... అది కూడా 11 ఏళ్ల క్రితం 2009లో టైటిల్ గెలిచాడు. మిగతా మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 7–6 (7/5), 6–4, 7–5తో ఎగొర్ గెలరసిమోవ్ (బెలారస్)పై, నాలుగో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 7–5, 6–1, 6–3తో పెడ్రో మార్టినెజ్ (స్పెయిన్)పై, 15వ సీడ్ వావ్రింకా 4–6, 7–5, 6–3, 3–6, 6–4తో అండ్రిస్ సెప్పి (ఇటలీ)పై విజయం సాధించారు. ఐదో సీడ్ డోమినిక్ థిమ్ (ఆ్రస్టియా) 6–2, 5–7, 6–7 (5/7), 6–1, 6–2తో ఓ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ పొందిన అలెక్స్ బోల్ట్ (ఆస్ట్రేలియా)పై శ్రమించి నెగ్గాడు. ఆ్రస్టేలియన్ స్టార్ నిక్ కిర్జియోస్ 6–2, 6–4, 4–6, 7–5తో ఫ్రాన్స్‌కు చెందిన గైల్స్ సిమోన్‌ను ఓడించాడు. -
రోజర్ ఫెదరర్ 15 ఏళ్ల తర్వాత..
స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ 15 ఏళ్ల తర్వాత హాప్ మన్ కప్ టోర్నీలో పాల్గొననున్నాడు. ఈ విషయాన్ని కప్ నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు. వచ్చే ఏడాది పెర్త్‌లో నిర్వహించనున్న ఈ టోర్నీలోవరల్డ్ నం.3 ఆటగాడు ఫెదరర్‌కు జోడీగా బెలిండా బిన్సిక్ బరిలో దిగుతాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా గ్రాండ్‌స్లామ్ కు కొన్నిరోజుల ముందు వార్మప్ టోర్నీగా హాప్ మన్ కప్ నిర్వహించనున్నారు. ఫెదరర్ చివరగా 2001లో మార్టినా హింగిస్ తో కలిసి మిక్స్డ్ డబుల్స్ నెగ్గాడు. ఆ తర్వాతి ఏడాది తన భార్య మిర్కా ఫెదరర్‌తో స్విస్ స్టార్ జతకట్టాడు. 2002 తర్వాత ఈ టోర్నీలో ఫెదరర్ పాల్గొనలేదు. సీజన్ స్టార్ట్ చేయడానికి అదే సరైన సమయమని ఫెదరర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం రియోకు సన్నద్ధమవుతున్న స్విస్ స్టార్ కెనడా మేజర్ ఈవెంట్ టొరంటో మాస్టర్స్ టోర్నీ నుంచి వైదొలిగినట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.