మూడో రౌండ్లో బెన్సిక్, ప్లిస్కోవా

Halep Simona Fights Past Dart In Australian Open Second Round - Sakshi

నాదల్, థీమ్‌ ముందంజ

ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌

సీడెడ్‌ ప్లేయర్లు తమ జోరు కొనసాగించారు. ఆరంభ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో ఎలాంటి సంచలనానికి తావివ్వకుండా నాలుగో రోజు ఆటను ముగించారు. రెండో సీడ్‌ ప్లిస్కోవా, నాలుగో సీడ్‌ హలెప్, ఆరో సీడ్‌ బెన్సిక్‌ అలవోక విజయాలతో మూడో రౌండ్లోకి  ప్రవేశించారు.

మెల్‌బోర్న్‌: ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో ఈసారి టైటిల్‌పై కన్నేసిన కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) మరో సునాయాస విజయంతో రెండో రౌండ్‌ను దాటేసింది. 2018 రన్నరప్‌ హలెప్‌ (రొమేనియా) కూడా వరుస సెట్లలోనే  ప్రత్యర్థిని ఓడించింది. స్విట్జర్లాండ్‌ స్టార్, ఆరో సీడ్‌ బెలిండా బెన్సిక్‌ మాజీ ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌ ఒస్లాపెంకోను కంగుతినిపించగా... పురుషుల సింగిల్స్‌లో నంబర్‌వన్‌ నాదల్‌కు రెండో సెట్‌లో గట్టీపోటీ ఎదురైనా మ్యాచ్‌ను మాత్రం మూడు సెట్లలోనే ముగించాడు. మాజీ చాంపియన్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌) మూడో రౌండ్‌ చేరేందుకు ఐదు సెట్లు పోరాడాల్సి వచి్చంది. అమ్మయ్యాక తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆడుతున్న భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా గాయంతో ని్రష్కమించింది.  

ఒస్టాపెంకోకు మళ్లీ నిరాశే  
మహిళల సింగిల్స్‌లో జెలీనా ఒస్టాపెంకోకు ఆ్రస్టేలియా ఓపెన్‌లో మళ్లీ నిరాశ ఎదురైంది. 2017 ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌ అయిన లాతి్వయా స్టార్‌ ఇక్కడ ఒకటి లేదంటే మూడో రౌండ్లలో ని్రష్కమించేది. తాజాగా ఆరో సీడ్‌ బెన్సిక్‌ (స్విట్జర్లాండ్‌) చేతిలో రెండో రౌండ్లో ఓడింది. స్విస్‌ క్రీడాకారిణి 7–5, 7–5తో ఒస్టాపెంకో ఆట ముగించింది. మిగతా మ్యాచ్‌ల్లో ప్లిస్కోవా 6–3, 6–3తో లౌర సీగెమండ్‌ (జర్మనీ)పై, హలెప్‌ 6–2, 6–4తో ఇంగ్లండ్‌ క్వాలిఫయర్‌ హరియెట్‌ డార్ట్‌పై, 17వ సీడ్‌ కెర్బెర్‌ (జర్మనీ) 6–3, 6–2తో ప్రిసిలా హాన్‌ (ఆ్రస్టేలియా)పై పోటీలేని విజయాలు సాధించి ముందంజ వేశారు. ఐదో సీడ్‌ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్‌) 6–2, 7–6 (8/6)తో డావిస్‌ (అమెరికా)ను ఓడించగా.. మాజీ ప్రపంచ నంబర్‌వన్‌ ముగురుజ 6–3, 3–6, 6–3తో అజ్లా టాంజనోవిక్‌ (ఆ్రస్టేలియా)పై విజయం సాధించింది.  

మూడో రౌండ్లో నాదల్‌
గత ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ రన్నరప్, టైటిల్‌ ఫేవరెట్లలో ఒకడైన టాప్‌సీడ్‌ స్పానిష్‌ దిగ్గజం రాఫెల్‌ నాదల్‌ మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్లో అతను 6–3, 7–6 (7/4), 6–1తో డెల్బొనిస్‌ (అర్జెంటీనా)ను ఓడించాడు. 19 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత అయిన నాదల్‌ ఇక్కడ మాత్రం ఒక్కసారి మాత్రమే... అది కూడా 11 ఏళ్ల క్రితం 2009లో టైటిల్‌ గెలిచాడు. మిగతా మ్యాచ్‌ల్లో ఏడో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 7–6 (7/5), 6–4, 7–5తో ఎగొర్‌ గెలరసిమోవ్‌ (బెలారస్‌)పై, నాలుగో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా) 7–5, 6–1, 6–3తో పెడ్రో మార్టినెజ్ (స్పెయిన్‌)పై, 15వ సీడ్‌ వావ్రింకా 4–6, 7–5, 6–3, 3–6, 6–4తో అండ్రిస్‌ సెప్పి (ఇటలీ)పై విజయం సాధించారు.  ఐదో సీడ్‌ డోమినిక్‌ థిమ్‌ (ఆ్రస్టియా) 6–2, 5–7, 6–7 (5/7), 6–1, 6–2తో ఓ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ పొందిన అలెక్స్‌ బోల్ట్‌ (ఆస్ట్రేలియా)పై శ్రమించి నెగ్గాడు. ఆ్రస్టేలియన్‌ స్టార్‌ నిక్‌ కిర్జియోస్‌ 6–2, 6–4, 4–6, 7–5తో ఫ్రాన్స్‌కు చెందిన గైల్స్‌ సిమోన్‌ను ఓడించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top