
అమ్‌స్టెల్వీన్ (నెదర్లాండ్స్): యూరప్ పర్యటనలో భారత్ ‘ఎ’ పురుషుల హాకీ జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. మంగళవారం ఇంగ్లండ్‌తో జరిగిన హోరాహోరీ పోరులో భారత ‘ఎ’ జట్టు 2–3 గోల్స్ తేడాతో ఓడింది. మన జట్టు తరఫున మణీందర్ సింగ్, ఉత్తమ్ సింగ్ చెరో గోల్ చేశారు. ఈ టూర్‌లో భాగంగా తొలి మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకున్న భారత్... ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడింది.
‘ప్రతి మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాం. గత రెండు మ్యాచ్‌ల్లో పోరాడినా ఫలితం దక్కలేదు. మెరుగైన ప్రత్యర్థులతో మరో మూడు మ్యాచ్‌లు ఆడనున్నాం. వాటిలో మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు ప్రయత్నిస్తాం’ అని కోచ్ శివేంద్ర సింగ్ అన్నాడు. తదుపరి మ్యాచ్‌లో బెల్జియంతో భారత జట్టు ఆడుతుంది.