Lionel Messi: వరల్డ్‌కప్‌ కొట్టిన ఒక్కరోజు వ్యవధిలో మరో అరుదైన ఘనత

Day After Win-FIFA WC-Messi Completes 400 Million Instagram Followers - Sakshi

అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లియోనల్‌ మెస్సీ ప్రస్తుతం ఫిఫా వరల్డ్‌కప్‌ టైటిల్‌ సాధించానన్న ఆనందంలో మునిగి తేలుతున్నాడు. మెస్సీ సంతోషం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఆదివారం ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్లో పెనాల్టీ షూటౌట్‌లో 4-2 తేడాతో గెలిచిన అర్జెంటీనా టైటిల్‌ విజేతగా నిలిచింది. 16 ఏళ్ల నిరీక్షణ.. 36 ఏళ్ల అర్జెంటీనా కలను తీర్చాడు కాబట్టే మెస్సీ అంత సంతోషంగా ఉన్నాడు.

ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మారడోనా తర్వాత ఆ లిగసీని కంటిన్యూ చేస్తూ ఎట్టకేలకు అర్జెంటీనాకు మూడో వరల్డ్‌కప్‌ను అందించాడు. ఈ వరల్డ్‌కప్‌లో అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ ఏడు గోల్స్‌తో పాటు మూడు అసిస్ట్‌లు చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా గోల్డెన్‌ బాల్‌ అవార్డు సొంతం చేసుకున్నాడు. తాజాగా ఫిఫా వరల్డ్‌కప్‌ కొట్టిన ఒక్కరోజు వ్యవధిలోనే మెస్సీ మరో అరుదైన ఘనత సాధించాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో మెస్సీ 400 మిలియన్‌ ఫాలోవర్స్‌ను సంపాదించించాడు. దీంతో క్రిస్టియానో రొనాల్డో తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ కలిగిన సెలబ్రిటీగా మెస్సీ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక రొనాల్డో 517 మిలియన్‌ ఫాలోవర్స్‌తో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. అంతేకాదు 500 మిలియన్‌ కన్నా ఎక్కువ ఫాలోవర్స్‌ కలిగిన తొలి వ్యక్తిగా పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో కొత్త చరిత్ర సృష్టించాడు.

చదవండి: నిండా పాతికేళ్లు లేవు.. ప్రపంచమే సలాం కొట్టింది; ఎవరీ ఎంబాపె

నిరీక్షణ ముగిసింది.. మెస్సీ సాధించాడు

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top