FIFA WC 2022 Prize Money: ప్రైజ్‌మనీ.. విన్నర్‌కు ఎంత ; రన్నరప్‌కు ఎంత?

How Much Money Will Winners-Runner-up of FIFA World Cup 2022 Get - Sakshi

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌తో.. మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా అమితుమీ తేల్చుకోనుంది. వరుసగా రెండోసారి వరల్డ్‌కప్‌ సాధించి ఇటలీ, బ్రెజిల్‌ సరసన నిలవాలని ఫ్రాన్స్‌ అనుకుంటే.. అర్జెంటీనా మాత్రం మెస్సీ కోసమైన టైటిల్‌ గెలవాల్సిన అవసరం ఉంది. అన్నీ తానై జట్టును నడిపిస్తున్న మెస్సీనే జట్టుకు పెద్ద బలం. ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌.. మెస్సీకి అర్జెంటీనా తరపున చివరి మ్యాచ్‌ కానున్న సంగతి తెలిసిందే. అందుకే ఫైనల్లో గెలిచి మెస్సీకి కప్‌ అందించి ఘనమైన వీడ్కోలు ఇ‍వ్వాలని అర్జెంటీనా కోరుకుంటుంది. 

ఈ సంగతి పక్కనబెడితే.. ఫిఫా ఛాంపియన్స్‌గా నిలిచే జట్టు ఎంత ప్రైజ్‌మనీ అందుకుంటుంది.. అదే విధంగా రన్నరప్‌గా నిలిచే జట్టు ఎంత సొంతం చేసుకుంటుదనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మూడోస్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో మొరాకోపై గెలిచిన క్రొయేషియా రూ. 225 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకుంది. ఇక నాలుగో స్థానంలో నిలిచిన మొరాకో జట్టు రూ.206 కోట్లు అందుకుంది.

మూడో ప్లేస్‌లో ఉన్న జట్టుకే పెద్ద మొత్తం వచ్చిందంటే.. ఇక తొలి రెండు స్థానాల్లో నిలిచిన రెండు జట్లకు కళ్లు చెదిరే మొత్తం లభించడం గ్యారంటీ. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌ 2022 టైటిల్‌ విజేత రూ.368 కోట్ల ప్రైజ్‌మనీ కొల్లగొట్టనుంది. అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన జట్టు రూ. 249 కోట్లు సొంతం చేసుకోనుంది.

ఇక క్వార్టర్‌పైనల్స్‌లో వెనుదిరిగిన బ్రెజిల్‌,నెదర్లాండ్స్‌, పోర్చుగల్‌, ఇంగ్లండ్‌లకు రూ.141 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. రౌండ్‌ ఆఫ్‌ 16లో వెనుదిరిగిన అమెరికా, జపాన్‌, స్పెయిన్‌, సెనెగల్‌, పోలాండ్‌, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్‌, సౌత్‌ కొరియాలకు రూ.107 కోట్ల ప్రైజ్‌మనీ అందనుంది. ఇక లీగ్‌ దశలో వెనుదిరిగిన జట్లకు రూ. 75 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకోనున్నాయి.

చదవండి: చివరిసారిగా అందాల ప్రదర్శన.. లుకా మోడ్రిక్‌ కోసం

'మెస్సీ కల నెరవేరాలి.. అప్పుడే మనస్పూర్తిగా నవ్వగలను'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top