FIFA WC Ivana Knoll: చివరిసారిగా అందాల ప్రదర్శన.. లుకా మోడ్రిక్‌ కోసం

Croatia Model Ivana Knoll Thanks Luka Modric Wearing Special-Outfit - Sakshi

ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో క్రొయేషియా మూడోస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. శనివారం మూడోస్థానం కోసం మొరాకోతో జరిగని ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో 2-1 తేడాతో క్రొయేషియా ఘన విజయం సాధించింది. గతేడాది రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జట్టు కెప్టెన్‌ లుకా మోడ్రిక్‌ తన కెరీర్‌లో చివరి ఫిఫా వరల్డ్‌కప్‌ ఆడేసినట్లే.

వరుసగా రెండు ప్రపంచకప్‌ల్లో క్రొయేషియాను నడిపించిన లుకా మోడ్రిక్‌ ఒకసారి రన్నరప్‌, మరోసారి మూడో స్థానంలో నిలిపాడు. టైటిల్‌ అందుకోవాలన్న తన కలను నెరవేర్చుకోలేకపోయాడు లుకా మోడ్రిక్‌. అయినా కూడా ఈ క్రొయేషియా స్టార్‌ తన ఆటతో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

ఈ సంగతి పక్కనబెడితే.. ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫుట్‌బాల్‌ స్టార్స్‌ తర్వాత మరో పేరు బాగా మార్మోగింది. ఆమెనే క్రొయేషియా మోడల్‌ ఇవానా నోల్‌. ఖతర్‌లో పొట్టి దుస్తులు వేసుకోవాన్ని ఆ దేశం బహిష్కరించనప్పటికి  ఇవానా నోల్‌ మాత్రం పొట్టి బట్టలు ధరించి క్లీవేజ్‌ షో చేస్తూ అందాల ఆరబోతను ప్రదర్శించింది. తనకు ఖతర్‌ అధికారుల నుంచి అనుమతి ఉందని.. అందుకే పొట్టి దుస్తులు వేసుకొని స్టేడియానికి వచ్చినట్లు ఇవానా పేర్కొంది.

ఇక తాజాగా శనివారం క్రొయేషయా, మొరాకోల మధ్య జరిగిన ప్లేఆఫ్‌ మ్యాచ్‌లో మరోసార దర్శనమిచ్చింది. అయితే ఈసార అందాల ప్రదర్శన కాకుండా తన ఫెవరెట్‌ అయిన.. క్రొయేషియా కెప్టెన్‌ లుకా మోడ్రిక్‌ కోసం మ్యాచ్‌కు వచ్చిందంట. అందుకు తగ్గట్లుగానే లుకా మోడ్రిక్‌ పేరున్న ప్రత్యేక ఔట్‌ఫిట్‌ను వేసుకొచ్చింది. ఈ సందర్భంగా లుకా మోడ్రిక్‌కు స్పెషల్‌ థాంక్స్‌ చెబుతూ.. థాంక్యూ కెప్టెన్‌ లుకా మోడ్రిక్‌.. మన దేశం గర్వించేలా చేశారు. ఇక మూడోప్లేస్‌లో నిలిచి మెడల్‌ అందుకోవడమే తరువాయి. ఇంకెందుకు ఆలస్యం పని కానిచ్చేయండి అంటూ రాసుకొచ్చింది.

ఇవానా నోల్‌ కోరికను క్రొయేషియా నిలబెట్టింది. మొరాకోతో జరిగిన మ్యాచ్‌లో 2-1తేడాతో గెలిచి ఈ వరల్డ్‌కప్‌ను మూడోస్థానంతో ముగించింది క్రొయేషియా జట్టు. ఏది ఏమైనా ఈసారి మాత్రం ఇవానా నోల్‌ తన అందచందాలతో ప్రత్యేకంగా నిలిచింది.

చదవండి: మొరాకోపై ఘన విజయం.. మూడోస్థానం క్రొయేషియాదే

FIFA: అర్జెంటీనాదే వరల్డ్‌కప్‌.. గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top