క్రొయేషియాలోని భారతీయ రాయభార కార్యాలయంపై అక్కడి ఖలిస్థానీ వేర్పాటువాదులు దాడి చేశారు. అక్కడి రాజధాని నగరం జాగ్రెబ్‌లోని భారత రాయభార కార్యాలయంలోకి చొరబడి దాడి చేసి అనంతరం కార్యాలయంపై ఉన్న జాతీయపతాకాన్ని తొలగించారు. దీనిపై భారత విదేశాంగశాఖ తీవ్రంగా స్పందించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని క్రొయేషియాను ఆదేశించింది.
భారత విదేశాంగ శాఖ ఈఘటనపై స్పందిస్తూ "జ్రాగ్రెల్‌లోని మా రాయభార కార్యాలయంపై దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వియన్నాం కన్వెన్షన్ ప్రకారం రాయభార కార్యాలయాల ఎదుట నిరసన చర్యలు సరైనవి కావు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలి. రాయభార కార్యాలయాలను రక్షించాలి.ఇటువంటి చర్యలతో నిందితులు ఉద్దేశం ఏమిటో స్పష్టంగా అర్థమవుతోంది. చట్టం వీటన్నిటిని గమనిస్తూనే ఉంటుంది"అని విదేశాంగశాఖ ప్రకటన విడుదల చేసింది. అయితే ఐరోపా ప్రతినిధులు త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ దాడికి సంబంధించిన వీడియోను సిక్స్ ఫర్ జస్టిస్ లీడర్ గురుపట్వానీ సింగ్ పన్నుమ్ ఆన్‌లైన్‌లో షేర్ చేశారు. ఆ వీడియోలో ఖలిస్థానీ వేర్పాటువాదులు భారత పతకాన్ని తీసి దానిపై ఖలీస్థాని జెండా పెట్టారు. అయితే గతేడాది క్రొయేషియాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా భారత్‌కు మద్దతిస్తున్నందుకు ఆదేశానికి ధన్యవాదాలు తెలిపారు. ఆదేశంలో పర్యటించిన తొలి ప్రధాని మోదీ అవడం గమనార్హం.
🚨🇮🇳🇭🇷 India strongly condemns the illegal trespass & vandalism at its Embassy in Croatia by anti-India elements
Khalistani extremists reportedly removed Tiranga from outside the embassy in Zagreb and replaced it with a "Khalistani flag". pic.twitter.com/kvAvuiG6RQ— Sputnik India (@Sputnik_India) January 22, 2026


