
పధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనలో ఉన్న సంగతి తెలిసింది. అందులో భాగంగా ఈ రోజు (శనివారం) ఉదయం అర్జెంటినాకు చేరుకున్నారు. ఆయనకు బ్యూనస్ ఎయర్‌లోని భారత సంతతి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అక్కడ ఆయన అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీతో చర్చలు జరపనున్నారు. ఈ నేపథ్యంలో విజయగుప్తా అనే భారత సంతతి వ్యక్తి మోదీని కలిసినందుకు సంతోషం వ్యక్తం చేశాడు.
తాను ప్రధాని మోదీకి హలో చెప్పేందుకే 400 కి.మీ ప్రయాణించి మరి వచ్చానని అన్నారు. ఆయనకు జస్ట్ హలో చెప్పాలనుకున్నా..కానీ నాకు మోదీకే కరచలనం(షేక్‌హ్యాండ్) ఇచ్చే అవకాశం లభించిందంటూ ఉబ్బితబ్బిబవుతున్నాడు. ఇదిలా ఉండగా మోదీ ఒక ట్వీట్‌లో అర్జెంటీనా పర్యటన గురించి పంచుకున్నారు. "నేను ఈరోజు అర్జెంటీనాతో సంబంధాలను పెంపొందించుకోవడంపై దృష్టి సారించే ద్వైపాక్షిక పర్యటన కోసం బ్యూనస్ ఎయిర్స్‌లో అడుగుపెట్టాను. ప్రస్తుతం అర్జెంటినా అధ్యక్షుడు జేవియర్ మిలీని కలిసి చర్చలు జరిపేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాను" అని ట్వీట్ చేశారు.
అలాగే విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కూడా ఈ 57 ఏళ్లలో భారత ప్రధాని అర్జెంటీనాలో చేసిన తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే అని ట్వీట్ చేశారు. కాగా, మోదీ బ్యూనస్ ఎయిర్స్‌లోని హోటల్‌కు చేరుకోగానే 'భారత్ మాతా కీ జై', 'జై శ్రీ రామ్' అనే నినాదాలతో ఘన స్వాగతం పలికారు ప్రవాస భారతీయులు. ఆయన ఇప్పటికే ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగోలను సందర్శించారు. ఇక ఈ అర్జెంటీనా పర్యటన తదనంతరం బ్రెజిల్, నమీబియాలను సందర్శించనున్నారు.
#WATCH | Buenos Aires, Argentina: Vijay Kumar Gupta, a member of the Indian diaspora, says, "I have come here from Rosario, which is 400 kilometres from here, just to say hello to Prime Minister Narendra Modi. I got the opportunity to shake hands with him..." https://t.co/7yZBOqwXFT pic.twitter.com/jS0uoHPGUn
— ANI (@ANI) July 5, 2025
(చదవండి: ఎవరా 'బీహార్ కీ భేటీ'?.. మోదీ మనసులో కరేబియన్ ప్రధానికి ప్రత్యేక స్థానం)