ఎవరా 'బీహార్‌ కీ భేటీ'?.. మోదీ మనసులో కరేబియన్‌ ప్రధానికి ప్రత్యేక స్థానం | Modi calls Trinidad and Tobago PM Bihar ki Beti for her Buxar roots | Sakshi
Sakshi News home page

ఎవరా 'బీహార్‌ కీ భేటీ'?.. మోదీ మనసులో కరేబియన్‌ ప్రధానికి ప్రత్యేక స్థానం

Jul 4 2025 12:06 PM | Updated on Jul 4 2025 4:02 PM

Modi calls Trinidad and Tobago PM Bihar ki Beti for her Buxar roots

ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ట్రినిడాడ్ అండ్‌ టొబాగోకి చేరుకున్నారు. అక్కడ పోర్ట్‌ ఆప్‌ స్పెయిన్‌లోని పియార్కో అంతర్జాతీయ విమానశ్రయంలో ఆయనకు ఆ దేశ మిలటరీ సైనికులచే గౌరవ వందనం లభించింది. అంతేగాదు కరేబియన్‌ దేశ ప్రధాన మంత్రి కమలా పెర్సాద్-బిస్సేసర్‌(Kamla Persad-Bissessar)తో సహా 38 మంత్రులు, నలుగురు పార్లమెంట్‌ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. 

ఆ స్వాగత సమయంలో ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగొ మంత్రి కమలా పెర్సాద్‌ భారతీయ దుస్తుల్లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. కానీ మన మోదీ ఆ దేశ ప్రధాని కమ్లా పెర్సాద్‌ను 'బిహారీకా బేటి' అని పిలవడం విశేషం. అంతేగాదు ఆ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ..భారత్‌కి ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోకి ఉన్న సంబంధబాంధవ్యాలతో సహా ఆ దేశ ప్రధాని భారత మూలాలకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మరి విశేషంలేంటో సవివరంగా చూద్దామా..!.

ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. కరేబియన్దేశ ప్రధాని కమలా పెర్సాద్- మా బిహార్కా భేటి అని సగర్వంగా చెప్పారు. ప్రధాని పూర్వీకులు బిహార్లోని బక్సర్కు చెందినవారని, ఆమె కూడా భారతదేశంలోని ప్రాంతాన్ని సందర్శించారని తెలిపారు. మాకు దేశంతో కేవలం రక్త సంబంధం లేదా ఇంటి పేరుతోనో బంధం ఏర్పడలేదని అంతకుమించిన బాంధవ్యం ఇరు దేశాల నడుమ ఉందని అన్నారు

స్నేహం చిగురించింది ఇలా..
అలాగే ఇరు దేశాల మధ్య స్నేహం ఎలా చిగురించిందో కూడా గుర్తు చేసుకున్నారు. బనారస్, పాట్నా, కోల్‌కతా, ఢిల్లీ వంటి నగరాలు భారతదేశంలోనే కాకుండా ట్రినిడాడ్‌లో వీధి పేర్లుగా కూడా ఉన్నాయని చెప్పారు. అలా రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు అత్యంత బలంగా ఉన్నాయన్నారు. అందుకు నిదర్శనం ఇక్కడ జరుపుకునే నవరాత్రులు, మహాశివరాత్రి, జన్మాష్టమి వంటి పండుగలేనని అన్నారు. ఈ దేశ పురాతన చౌతల్‌(సంగీతం), భైతక్‌(వ్యాయామం) ఎంత ప్రాచుర్యం పొందాయో తెలుసనని అన్నారు

ఇకఇక్కడ సుమారు 5 లక్షల మందికి పైనే భారత సంతతికి చెందినవారు నివసిస్తున్నారని, వారిలో దాదాపు 1800 మంది ప్రవాస భారతీయులని, మిగిలినివారు 1845, 1917 మధ్య భారతదేశం నుంచి ఒప్పంద కార్మికులుగా వలస వచ్చిన స్థానిక పౌరులేనని గుర్తుచేశారు. అందువల్ల మిమ్మల్ని భారత్జాగ్రత్తగా చూసుకుంటుందని హామీ ఇచ్చారు. అంతేగాదు మా దేశం మీకు సదా ఆహ్వానం పలుకుతుందని చెప్పారు. అలాగే బిహార్కూడా శతాబ్దాలుగా వివిధ రంగాలలో ప్రపంచానికి మార్గం చూపించదని చెప్పారు. 21వ శతాబ్దంలో కూడా బీహార్ నుంచి కొత్త అవకాశాలు ఉద్భవిస్తాయని న్నారు.

ఎవరీ కమలా పెర్సాద్‌..
కమలా పెర్సాద్బిస్సేసర్‌ 1987లో రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. అనేక చారిత్రక నిర్ణయాలతో పేరుతెచ్చుకున్న మంత్రి. అంతేగాదు ఆమె కరేబియన్ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి, అటార్నీ జనరల్, ప్రతిపక్ష నాయకురాలు కూడా. అలాగే కామన్వెల్త్ దేశాలకు అధ్యక్షత వహించిన తొలి మహిళ. అదీగాక తొలి భారత సంతతి మహిళా ప్రధానిగా కూడా ఘనత దక్కించుకున్నారామె.

ఇక ట్రినిడాడ్అండ్టొబాగో భారతదేశంలోని జోధ్పూర్కంటే చిన్నదేశమే అయినా..మాన భారతదేశ సంస్కృతి, ఆర్థికవ్యవస్థలో కీలక పాత్ర పోషించడం విశేషం. కాగా, ట్రినిడాడ్అండ్టొబాగోలోని నివశిస్తున్న ఆరవతరం భారతీయ ప్రవాసులకు ఓసీఐ(ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా(OCI)) కార్డులు అదిస్తామని ప్రకటించారు మోదీ.

 

(చదవండి: అమెరికా ఆఫీసులో భారతీయ మహిళ ఆకలి తిప్పలు..! పాపం ఆ రీజన్‌తో..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement