
అమెరికాలోని ఫ్లోరిడాలో వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. డాక్టర్ కొండా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ వైద్య, ఆరోగ్య శాఖ సలహాదారు డాక్టర్ వాసుదేవ రెడ్డి.. కాటసాని రాంభూపాల్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, ఉద్యోగ కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పోర్టులు వంటి వివిధ రంగాలలో చేసిన అభివృద్ధి కార్యకలాపాలను డాక్టర్ వాసుదేవ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి కాటసాని రాంభూపాల్‌రెడ్డి ప్రస్థావించారు. సంక్షేమం, అభివృద్ధి, నిజాయితీ కలసిన ప్రజా పాలనను జగనన్న అందించారని కొనియాడారు. కాని ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన కొనిసాగుతుందని విమర్శించారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కూటమి ప్రభు త్వం.. వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ ప్రజలను దారి మళ్లిస్తోందని ఆరోపించారు. ఇక ఎన్నారై నాయకులకు, వైఎస్సార్‌సీపీ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లకు అన్ని విధాలుగా తాము అండగా ఉంటామని రాంభూపాల్‌రెడ్డి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ కొండా మోహన్ రెడ్డి , డాక్టర్ వాసుదేవ రెడ్డి, సాయి ప్రభాకర్ , డాక్టర్ నరేందర్ రెడ్డి , రఘు , కేశవ్ , జనార్ధన్ , సంజీవ , సురేందర్, వీరారెడ్డి , వంశీ , రమేష్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో వైఎస్సార్ అభిమానులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు