
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ భారత్-అర్జెంటీనాల సంబంధాలను బలోపేతం చేసే దిశగా తన వంతు ప్రయత్నాలను సాగిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన ఈరోజు (శనివారం) ఉదయం ఆయన అర్జెంటీనాకు చేరుకున్నారు. నేడు ఆయన అధ్యక్షుడు జేవియర్ మిలేతో సమావేశం కానున్నారు. ప్రస్తుతం ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటనలో ఉన్నారు.
అర్జెంటీనాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆ రోజు సాయంత్రం ప్రధాని మోదీ అర్జెంటీనా నేషనల్ హీరో జనరల్ జోస్ డి శాన్ మార్టిన్ విగ్రహం వద్ద ఆయనకు నివాళులర్పించనున్నారు. అనంతరం అధ్యక్షుడు మిలే అందించే ఆతిథ్యం అందుకోనున్నారు. నగరంలోని ఐకానిక్ క్లబ్ బోకా జూనియర్స్ ఫుట్‌బాల్ స్టేడియంను కూడా ప్రధాని సందర్శించనున్నారు. అర్జెంటీనాలో ప్రధాని పర్యటన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని, పరస్పర సహకారానికి కొత్త మార్గాలను తెరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
Landed in Buenos Aires for a bilateral visit which will focus on augmenting relations with Argentina. I’m eager to be meeting President Javier Milei and holding detailed talks with him.@JMilei pic.twitter.com/ucdbQhgsUj
— Narendra Modi (@narendramodi) July 5, 2025
ఇరు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చలు.. వాణిజ్యం,పెట్టుబడి, ఆరోగ్యం, ఔషధాలు, రక్షణ, మౌలిక సదుపాయాలు, మైనింగ్, వ్యవసాయం, ఆహార భద్రత, గ్రీన్ ఎనర్జీ,డిజిటల్ ఆవిష్కరణ, విపత్తు నిర్వహణ తదితర విభిన్న రంగాలపై దృష్టి సారించనున్నాయి. అధ్యక్షుడు జేవియర్ మిలే ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అర్జెంటీనాకు చేరుకున్నారు. గతంలో ఈ ఇద్దరు నేతలు 2024లో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో కలుసుకున్నారు. ఈ ఐదు దేశాల పర్యటనకు ముందు, ప్రధాని మోదీ.. అర్జెంటీనాను లాటిన్ అమెరికాలో కీలక ఆర్థిక భాగస్వామిగా, జీ20 సమూహంలో సన్నిహిత సహకారిగా అభివర్ణించారు. ప్రధాని ఈ అర్జెంటీనా పర్యటన అనంతరం 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు.
ఇది కూడా చదవండి: మళ్లీ పాక్ అబద్ధం.. అజార్ ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నడంటూ..