ప్రపంచంలో అత్యంత కఠినమైన పర్వతారోహణలో ఒకటైన ఆకోంకాగువా శిఖరాన్ని భారతీయ సాహసికుడు, నగరానికి చెందిన కళాలి జై సింహ గౌడ్ అధిరోహించారు. ఆసియా ఖండం వెలుపల అత్యంత ఎత్తైన పర్వతంగా అర్జెంటీనాలోని ఈ ఆకోంకాగువా (6,961 మీటర్లు) గుర్తింపు పొందింది. అత్యల్ప ఉష్ణోగ్రతలు, ఆక్సిజన్ పరిస్థితుల్లో నడుమ ఈ శిఖరాన్ని అధిరోహించడం పర్వతారోహకులకు అతిపెద్ద సవాల్. ‘ఇన్ మ్యాన్ చాలెంజ్’ పూర్తి చేసిన సాహసికుడిగా ఇప్పటికే గుర్తింపు పొందిన జై సింహ గౌడ్, శారీరక బలంతో పాటు మనోధైర్యం, క్రమశిక్షణ, విశ్వాసంతో ఈ ఘనత సాధించారు. అత్యంత కఠిన శిక్షణతో లక్ష్యాన్ని చేరుకున్నారు. ప్రపంచంలోని ఖండాల్లో ఎత్తైన శిఖరాల అధిరోహణ, మహాసముద్రాల్లో ఈత, విపత్కర పరిస్థితుల్లో ఫుల్ మారథాన్లు పూర్తి చేసిన అనుభవం ఉన్న ఆయన.. ‘మేక్ ఫిట్ ఇండియా’లో భాగంగా ఫిట్నెస్‌పై ప్రజలకు అవగాహన కలి్పంచడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.


