FIFA WC 2022: ఛాంపియన్స్‌గా అర్జెంటీనా.. 36 ఏళ్ల తర్వాత

Argentina Beat France In Penalty Shoot-Out 4-2 Lift FIFA WC 2022 - Sakshi

వారెవ్వా ఏమి మ్యాచ్‌.. రెండు సింహాలు తలపడితే ఎవరిది పైచేయి అని చెప్పడం కష్టం. అచ్చం అలాంటిదే ఖతర్‌ వేదికగ జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో చోటుచేసుకుంది. మ్యాచ్‌లో క్షణక్షణానికి ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. మ్యాచ్‌లో మెస్సీ సేన గోల్‌ కొట్టిన ప్రతీసారి తానున్నానంటూ ఎంబాపె దూసుకొచ్చాడు. ఒకరకంగా అర్జెంటీనాకు ఎంబాపె కొరకరాని కొయ్యగా తయరయ్యాడని చెప్పొచ్చు.

ఆట 78వ నిమిషం వరకు కూడా మ్యాచ్‌ అర్జెంటీనా వైపే ఉంది. కానీ ఇక్కడే మ్యాచ్‌ అనూహ్య మలుపు తీసుకుంది. ఫ్రాన్స్‌ సూపర్‌ స్టార్‌ కైలియన్‌ ఎంబాపె ఆట 80వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత 81వ నిమిషంలో మరో గోల్‌ కొట్టడంతో ఒక్కసారిగా ఫ్రాన్స్‌ 2-2తో స్కోరును సమం చేసింది.

నిర్ణీత సమయం ముగియడం.. ఆ తర్వాత మరో 30 నిమిషాల పాటు అదనపు సమయం కేటాయించారు. ఈసారి కూడా 3-3తో సమంగా నిలవడంతో మ్యాచ్‌ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. పెనాల్టీ షూటౌట్‌లో మెస్సీ సేన నాలుగు గోల్స్‌ కొట్టగా.. ఫ్రాన్స్‌ రెండో గోల్స్‌​కు మాత్రమే పరిమితమైంది. దీంతో ఫిఫా వరల్డ్‌కప్‌ 2022 విజేతగా అర్జెంటీనా అవతరించింది. ఇక అర్జెంటీనా ఫిఫా ఛాంపియన్స్‌ కావడం ఇది మూడోసారి. ఇంతకముందు 1978, 1986లో విజేతగా నిలిచిన అర్జెంటీనా మళ్లీ 36 సంవత్సరాల నిరీక్షణ తర్వాత మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా విజయం సాధించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top