అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ భారత్ పర్యటనపై క్రీడాభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మూడు రోజుల 'ద గోట్ టూర్'లో భాగంగా డిసెంబర్ 13న భారత గడ్డపై ఆయన అడుగుపెడతారు. కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ మహా నగరాల్లో మెస్సీ పర్యటిస్తారు. పలు రకాల కార్యక్రమాల్లో పాల్గొని, ఫ్రెండ్లీ మ్యాచ్‌లు కూడా ఆడతారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సెలబ్రిటీలను ఆయన కలుస్తారు. కోల్‌కతాలో మొదలు పెట్టి ఢిల్లీలో ఆయన పర్యటన ముగుస్తుంది. మెస్సీతో పాటు రొడ్రిగో డి పాల్ (అర్జెంటీనా), ఉరుగ్వే లెజండరీ స్టైకర్ లూయిస్ సువాలెజ్ కూడా ఇండియాకు వస్తున్నారు.
తమ అభిమాన ఫుట్‌బాల్ క్రీడాకారులను ప్రత్యక్షంగా చూసేందుకు ఇండియా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మెస్సీని దూరం నుంచి చూడడమే తప్పా దగ్గరకు వెళ్లి ఫొటో తీసుకునే అవకాశం సామాన్యులకు ఉండదు. ఎందుకంటే మెస్సీతో ప్రత్యేకంగా ఫొటో దిగాలంటే దాదాపు 10 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా 100 మందికి మాత్రమే. మెస్సీ రాక కోసం తెలుగు అభిమానులు అమితాసక్తితో వేచివున్నారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో అతడు ఆడే మ్యాచ్ ప్రత్యక్షంగా చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఈ మ్యాచ్ వీక్షించాలంటే టిక్కెట్ తప్పనిసరి. వీటి ధరలు రూ.1750 నుంచి రూ.13500 వరకు ఉన్నాయి.
మరోవైపు లియోనల్ మెస్సీ (Lionel Messi) షెడ్యూల్‌పై ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. అతడు ఎప్పుడు ఎక్కడికి వెళతాడనే సమాచారం కోసం ఆన్‌లైన్‌లో శోధిస్తున్నారు. వారి కోసం మెస్సీ ఫుల్ షెడ్యూల్‌ను ఇక్కడ ఇస్తున్నాం.
మెస్సీ షెడ్యూల్ ఇలా...
డిసెంబర్ 13, కోల్‌కతా
ఉదయం 1:30: కోల్‌కతాకు రాక
ఉదయం 9:30 నుండి 10:30 వరకు: అభిమానులతో ముఖాముఖి
ఉదయం 10:30 నుండి 11:15 వరకు: మెస్సీ విగ్రహం వర్చువల్‌గా ప్రారంభోత్సవం
ఉదయం 11:15 నుండి 11:25 వరకు: యువ భారతికి రాక
ఉదయం 11:30: షారుఖ్ ఖాన్ యువ భారతికి రాక
మధ్యాహ్నం 12:00: సీఎం మమతా బెనర్జీ, సౌరవ్ గంగూలీ స్టేడియానికి రాక
మధ్యాహ్నం 12:00 నుండి 12:30 వరకు: ఫ్రెండ్లీ మ్యాచ్, సన్మానం, సంభాషణ
మధ్యాహ్నం 2:00: హైదరాబాద్‌కు బయలుదేరడం
డిసెంబర్ 13, హైదరాబాద్
సాయంత్రం 4: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాక, తాజ్ ఫలకనుమా ప్యాలెస్‌కు పయనం, మెస్సీతో మీట్ అండ్ గ్రీట్
రాత్రి 7: ఉప్పల్ స్టేడియానికి రాక, అభిమానులకు పలకరింపు, ఫ్రెండ్లీ మ్యాచ్, చిన్నారులకు మెస్సీ ఫుట్‌బాల్ చిట్నాలు, సన్మానం, రాత్రికి ఫలకనుమా ప్యాలెస్‌లో బస, మర్నాడు ఉదయం ముంబైకు పయనం.
చదవండి: ర్యాంప్‌పై మెస్సీ నడక
డిసెంబర్ 14, ముంబై
మధ్యాహ్నం 3:30: క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో పాడెల్ కప్‌లో పాల్గొనడం
సాయంత్రం 4:00: సెలబ్రిటీ ఫుట్‌బాల్ మ్యాచ్
సాయంత్రం 5:00: వాంఖడే స్టేడియంలో కార్యక్రమం, సెలబ్రిటీలతో ఛారిటీ ఫ్యాషన్ షో
డిసెంబర్ 15, న్యూఢిల్లీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం
మధ్యాహ్నం 1:30 గంటలకు: అరుణ్ జైట్లీ స్టేడియంలో కార్యక్రమం, మినర్వా అకాడమీ ఆటగాళ్లకు సన్మానం


