క్రిస్టియానో రొనాల్డోకు అవమానం..

Ronaldo Taunted Messi Chants After Al Nassr Knocked-Out Saudi Super Cup - Sakshi

పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోకు సొంత అభిమానుల మధ్య అవమానం ఎదురైంది. మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌తో తెగదెంపులు చేసుకున్న రొనాల్డో సౌదీ అరేబియా ఫుట్‌బాల్‌ క్లబ్‌ అల్‌ నసర్‌తో భారీ విలువకు ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. అల్‌ నసర్‌ తరపున రొనాల్డో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో పారిస​్‌ సెయింట్స్‌ జర్మన్‌(పీఎస్‌జీ)తో ఫ్రెండ్లీ మ్యాచ్‌ కూడా ఉంది. ఆ మ్యాచ్‌లో మెస్సీని డామినేట్‌ చేసిన రొనాల్డో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. కానీ మ్యాచ్‌లో మాత్రం రొనాల్డో అల్‌ నసర్‌ ఓడిపోయింది.

తాజాగా రొనాల్డో జట్టు మరో ఓటమిని మూటగట్టుకుంది. సౌదీ సూపర్‌కప్‌లో భాగంగా గురువారం అర్థరాత్రి రియాద్‌ వేదికగా అల్‌ ఇత్తిహద్‌, అల్‌ నసర్‌ల మధ్య లీగ్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో అల్‌ ఇత్తిహద్‌ 3-1 తేడాతో అల్‌ నసర్‌ జట్టును చిత్తు చేసింది. 90 నిమిషాల పాటు ఆడిన రొనాల్డో ఒక్క గోల్‌ కూడా కొట్టలేకపోయాడు. కాగా లీగ్‌లో ఇది రెండో ఓటమి కావడంతో సౌదీ సూపర్‌ కప్‌ నుంచి అల్‌ నసర్‌ జట్టు నిష్క్రమించింది. కాగా రొనాల్డో వచ్చిన తర్వాత అల్‌ నసర్‌ కు ఇదే మేజర్‌ కప్‌. కానీ కప్‌ కొట్టకుండానే ఇంటిబాట పట్టింది.

ఇక మ్యాచ్‌లో తన ఆటతో నిరాశపరిచిన రొనాల్డోను అభిమానులు అవమానించారు. మ్యాచ్‌ ముగిశాకా పెవిలియన్‌కు వస్తున్న సమయంలో రొనాల్డోనూ చూస్తూ మెస్సీ.. మెస్సీ అంటూ పెద్ద గొంతుతో అరిచారు. ఇది గమనించిన రొనాల్డో ఏలా స్పందించాలో తెలియక సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రొనాల్డో నేతృత్వంలోని అల్‌ నసర్‌ క్లబ్‌ అల్‌ ఫెచ్‌కు ప్రయాణం కానుంది. ఫిబ్రవరి మూడు నుంచి ప్రారంభం కానున్న సౌదీ ప్రో లీగ్‌లో ఆడనుంది.

చదవండి: జడేజా రాణించినా.. జట్టు మాత్రం ఓటమి

'22 ఏళ్ల పరిచయం.. కచ్చితంగా తప్పు చేసి ఉండడు'

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top