మెస్సీ మేనియా.. కోల్‌కత్తాలో జోష్‌ | Foot Ball Lionel Messi GOAT India Tour LIVE Updates, Highlights And Schedule In Telugu | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

మెస్సీ మేనియా.. కోల్‌కత్తాలో జోష్‌

నేపాల్‌ నుంచి అభిమానులు..

  • మెస్సీ కోసం నేపాల్‌ నుంచి అభిమానులు.
  • ఫుట్‌బాల్‌ స్టార్‌ మెస్సీని చూసేందుకు నేపాల్‌ నుంచి బెంగాల్‌కు అభిమానులు.
  • మెస్సీ కోసమే తాము వచ్చినట్టు వెల్లడి. 
2025-12-13 09:11:26

కాసేపట్లో మెస్సీ విగ్రహం ఆవిష్కరణ..

  • కాసేపట్లో మెస్సీ విగ్రహం ఆవిష్కరణ. 
  • కోల్‌కత్తాలో ఫుట్‌బాల్‌ అభిమానుల సందడి.. 
2025-12-13 08:37:43

72 గంటల బిజీ షెడ్యూల్‌..

  • దేశంలో సాకర్‌ దిగ్గజం మెస్సీ గడిపేది 72 గంటలే!
  • ఈ కాస్త సమయంలోనే తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర దిక్కుల్ని కవర్‌ చేయడమే అతిపెద్ద విశేషం.
  • కోల్‌కతా (తూర్పు), హైదరాబాద్‌ (దక్షిణ), ముంబై (పశ్చిమ), ఢిల్లీ (ఉత్తర) బిజీ షెడ్యూల్‌
  • కోల్‌కతాలో 78 వేల సీటింగ్‌ సామర్థ్యమున్న సాల్ట్‌లేక్‌ స్టేడియం కిక్కిరిసిపోనుంది.
  • ‘గోట్‌ టూర్‌’తో శనివారం ఉదయమే స్టేడియమంతా నిండిపోతోంది.
  • 45 నిమిషాల పాటు మెస్సీ స్టేడియంలో సరదాగా ఆటలు.  
  • అంతకుముందు మెస్సీకి ఘన స్వాగతం 
2025-12-13 08:12:23

మూడో రోజు మోదీని కలువనున్న మెస్సీ

  • డే–3 ఢిల్లీ
  • మూడో రోజు మెస్సీ దేశ రాజధానికి విచ్చేస్తాడు.
  • అరుణ్‌ జైట్లీ స్టేడియంలో నిర్వహించే ఫుట్‌బాల్‌ శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు.
  • పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలతో కలిసి పెనాల్టీ కిక్‌ షోలో పాల్గొంటాడు.
  • సాకర్‌ ప్రియుల్ని ఉత్సాహపరిచే ఈవెంట్‌లలో భాగమవుతాడు.
  • అనంతరం, మెస్సీ ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు.
2025-12-13 08:12:23

ముంబైలో మెస్సీ ర్యాంక్‌ వాక్‌

  • డే–2 ముంబై
  • హైదరాబాద్‌ నుంచి మెస్సీ నేరుగా ముంబై చేరుకుంటారు.
  • వాంఖడేలో చారిటీ మ్యాచ్‌ ఆడతాడు.
  • ఇందులో క్రికెట్‌ స్టార్స్‌ తదితరులతో కలిసి చారిటీ మ్యాచ్‌ బరిలోకి దిగుతాడు.
  • సచిన్‌ టెండూల్కర్, రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌లతో చారిటీ మ్యాచ్.
  • తర్వాత ఫ్యాషన్‌ షోలో స్వయంగా పాల్గొని ర్యాంప్‌ వాక్‌ చేయనున్నాడు.
  • బాలీవుడ్‌ స్టార్స్‌ జాన్‌ అబ్రహాం, కరీనా కపూర్, జాకీ ష్రాఫ్‌ తదితరులతో ర్యాంప్‌ వాక్‌ చేస్తాడు.
  • ఇది ముగిసిన వెంటనే ఖతర్‌–2022 ప్రపంచకప్‌ సాకర్‌కు సంబంధించిన వేలం జరుగుతుంది.
  • ఈ మెగా ఈవెంట్‌లో తాను వేసుకున్న జెర్సీలు, కిట్‌లను వేలం వేయనున్నారు.  
2025-12-13 08:02:37

మెస్సీతో రేవంత్‌ ఫ్రెండ్లీ మ్యాచ్‌..

  • డే–1 సెకండ్‌ హాఫ్‌ హైదరాబాద్‌
  • సాయంత్రం 4 గంటలకు మెస్సీ నేరుగా హైదరాబాద్‌కు చేరుకుంటాడు.
  • ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇచ్చే విందులో మెస్సీ పాల్గొంటారు.
  • ఈ కార్యక్రమంలో టాలీవుడ్‌ సినీ ప్రముఖులు, సీనియర్‌ రాజకీయ నాయకులు హాజరవుతారు.  
  • రాత్రి 7 గంటలకు ఉప్పల్‌ రాజీవ్‌గాంధీ స్టేడియంకు చేరుకుంటారు.
  • సీఎం రేవంత్‌ రెడ్డి సహా పలువురు ప్రముఖులతో కలిసి ‘గోట్‌ కప్‌’ ఫుట్‌బాల్‌ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ ఆడతాడు.
2025-12-13 08:02:37

14 ఏళ్ల తర్వాత భారత్‌కు మెస్సీ

  • 2011లోనూ భారత్‌కు మెస్సీ..
  • ఫుట్‌బాలర్‌ మెస్సీ 2011లోనూ భారత్‌కు వచ్చాడు.
  • ఫుట్‌బాల్‌కు ప్రాచుర్యం కల్పించేందుకు ‘ఫిఫా’ ఏర్పాటు చేసిన ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడేందుకు రాక.
  • కోల్‌కతాలో సాల్ట్‌లేక్‌ మైదానంలో వెనిజులాతో జరిగిన ఈ మ్యాచ్‌లో మెస్సీ టీమ్‌ అర్జెంటీనా 1–0తో జయభేరి మోగించింది.
  • ప్రస్తుతం మెస్సీ బస చేస్తున్న హోటల్‌ వద్ద అభిమానుల సందడి. 
2025-12-13 08:02:37

మెస్సీకి సత్కారం..

  • ఉదయం 10 గంటల నుంచి దాదాపు 1 గంట వరకు జరిగే ‘యువభారతి క్రీడాంగణ్‌’ సత్కారం.
  • సీఎం మమతా బెనర్జీ, షారుఖ్‌ ఖాన్, గంగూలీతోపాటు పలువురు సెలబ్రిటీలను మెస్సీ కలుసుకుంటాడు.
  • తర్వాత మధ్యాహ్నం 2 గంటల దాకా సాల్ట్‌లేక్‌ మైదానంలో మ్యాచ్‌ జరుగుతుంది. 
2025-12-13 07:48:32

డే–1 ఫస్ట్‌ హాఫ్‌ కోల్‌కతా

  • మెస్సీ ఈవెంట్‌కు పెట్టిన పేరు ‘గోట్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా’.
  • దేశంలోని నాలుగు నగరాల్లో మెస్సీ ముందుగా కోల్‌కత్తాలో అడుగు పెడతారు.
  • తన 70 అడుగుల విగ్రహాన్ని తానే ఆవిష్కరిస్తాడు.
  • భద్రతా కారణాల రీత్యా మెస్సీ ప్రత్యక్షంగా వెళ్లి రిబ్బన్‌ కట్‌ లాంటివి కాకుండా..
  • వర్చువల్‌గా బస చేసిన హోటల్‌ నుంచే తన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటాడు.
2025-12-13 07:48:32

కోల్‌కత్తాలో అభిమానుల జోష్‌

  • మెస్సీ మేనియా.. కోల్‌కత్తాలో జోష్‌
  • ఫుట్‌బాల్‌ దిగ్గజం మెస్సీ రాక కోల్‌కత్తాలో జోష్‌.
  • సాల్ట్‌ లేక్‌ స్టేడియం వద్ద ఉదయమే బారులు తీరిన అభిమానులు.
2025-12-13 07:48:32
Advertisement
 
Advertisement
Advertisement