
ఢిల్లీ: తన రీల్స్ చూడటం ఆపండంటూ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwalపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా(Rekha Gupta) వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈవీఎంల(EVMs)పై రేఖా గుప్తా మాట్లాడుతున్నట్లుగా ఓ ఎడిటెడ్ వీడియోను సామాజిక మాధ్యమంలో నిన్న(ఆదివారం) కేజ్రీవాల్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన రేఖా గుప్తా.. తన వీడియోలు, రీల్స్ చూడటం తగ్గించి.. తన సొంత పార్టీపై దృష్టి పెట్టాలంటూ కేజ్రీవాల్‌కు చురకలు అంటించారు.
ఎలక్ట్రిక్ బస్ డిపోకు శంకుస్థాపన చేసిన రేఖాగుప్తా.. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. "నేను కేజ్రీవాల్‌కు ఒకటి చెప్పాలనుకుంటున్నాను.. దయ చేసి నా వీడియోలు, ఇంటర్వ్యూలు, రీల్స్ చూడటం తగ్గించండి’’ అంటూ హితవు పలికారు. కేజ్రీవాల్ పంజాబ్ ప్రజలపై దృష్టి పెట్టాలి. అత్యంత ఘోరమైన వరద విపత్తును ఎదుర్కొన్న ఆ రాష్ట్రంలో బాధితులను ఆయన ఎప్పుడూ పరామర్శించలేదంటూ ఆమె విమర్శలు గుప్పించారు.
ఇదీ చదవండి: బీహార్‌లో మూడు దశల్లో ఎన్నికలు.. ఎప్పుడంటే?
‘‘ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించినందుకు మీరు సిగ్గుపడాలి. మీరు 11 సంవత్సరాలు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ఢిల్లీ అభివృద్ధిపై దృష్టి సారించి ఉంటే, ప్రజలు బాధలుపడేవారు కాదంటూ కేజ్రీవాల్‌పై రేఖాగుప్తా ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీపై కూడా ఢిల్లీ సీఎం తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ‘‘కాంగ్రెస్ గెలిస్తే అది ప్రజల తీర్పు, మేము గెలిస్తే ఈవీఎంలు హ్యాక్ అయ్యాయా? ఈ ఫార్ములా ఎక్కడ రాసుంది? అంటూ ఆమె ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే’’ అంటూ రేఖా గుప్తా మండిపడ్డారు.
दिल्ली की सीएम ये क्या कह रही हैं … pic.twitter.com/ZEf8RQVuzE
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 21, 2025