
ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) టెక్నాలజీని కాస్తా గట్టిగానే వాడేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫన్ క్రియేట్ చేసేందుకు ఏఐని విపరీతంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖుల ఫోటోలు, వీడియోల కంటెంట్ను ఎక్కువగా సృష్టిస్తున్నారు. ఇటీవలే బాలీవుడ్ స్టార్స్ వారి సతీమణులతో ఉన్న ఫన్నీ వీడియోను నెట్టింట హల్‌చల్ చేశాయి. ఈ వీడియో ఫ్యాన్స్కు తెగ నవ్వులు తెప్పించింది.
తాజాగా అలాంటి వీడియోనే దక్షిణాది సూపర్ స్టార్స్తో రూపొందించారు. హీరోలు సూర్య, అజిత్, బన్నీ, మహేశ్ బాబు, విజయ్, రామ్ చరణ్తో కలిసి ఫన్నీగా రూపొందించారు. ఇందులో హీరోలంతా హీరోయిన్స్కు ఫుడ్ తినిపిస్తూ కనిపించారు. ఏఐ సాయంతో రూపొందించిన ఈ వీడియో నెట్టింట తెగ నవ్వులు పూయిస్తోంది. తమ స్టార్ హీరోలేంటి ఇలా ఉన్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో మీరు కూడా చూసేయండి.
Prabhas annaaaaaa😂🤣😁#Prabhas𓃵 pic.twitter.com/43OVHX8wYQ
— G.O.A.T Prabhas (@goatPB1) August 8, 2025