రోడ్డుపై చిల్‌ అయిన మాజీ ఉప ముఖ్యమంత్రి.. వైరల్‌ వీడియోలు | Tejashwi Yadav Dances Makes Reels | Sakshi
Sakshi News home page

రోడ్డుపై చిల్‌ అయిన మాజీ ఉప ముఖ్యమంత్రి.. వైరల్‌ వీడియోలు

Sep 3 2025 10:58 AM | Updated on Sep 3 2025 11:07 AM

Tejashwi Yadav Dances Makes Reels

పట్నా: బీహర్‌లో ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల్లో సత్తా చాటేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇదే సమయంలో బీహార్‌లో ‍ప్రతిపక్షాలు ‘ఓటరు అధికార్ యాత్ర’ను చేపట్టాయి. దీనిలో పాల్గొన్న రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) నేత, బీహార్‌ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ యాత్ర ముగియగానే చిల్‌ అవుతూ కనిపించారు.
 

పట్నాలోని మెరైన్ డ్రైవ్ ఎక్స్‌ప్రెస్‌వే వద్ద పలువురు యువకులతో పాటు తేజస్వి యాదవ్‌ నృత్యం చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను అతని సోదరి రోహిణి ఆచార్య సోషల్ మీడియాలో షేర్ చేశారు. సింగపూర్ నుండి వచ్చిన తన మేనల్లుడితో కలిసి తేజస్వి యాదవ్‌ మెరైన్ డ్రైవ్‌లో డ్రైవ్ చేశారు. అనంతరం అక్కడ సోషల్ మీడియా కోసం రీల్స్‌ చేస్తున్న యువ కళాకారుల బృందాన్ని తేజస్వి చూశారు. వారి మధ్యకు చేరి ఉత్సాహంగా నృత్యం చేశారు. వారి నుంచి ట్రెండింగ్ డ్యాన్స్ మూవ్‌లను నేర్చుకున్నారు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సిగ్నేచర్ స్టెప్‌లను కూడా తేజస్వి అనుకరించారు.

 

 ఒక క్లిప్‌లో తేజస్వి ఆయన తన తండ్రి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను గుర్తుచేసే భోజ్‌పురి పాట ‘లాలు బినా చాలు ఈ బీహార్ న హోయి’కి నృత్యం చేశారు. మరో వీడియోలో ఆయన పోలీసు అధికారులతో సంభాషించడం, యువ కళాకారులతో రోడ్డు పక్కన టీ  తాగడం లాంటి దృశ్యాలు ఉన్నాయి. కాగా ఓటరు అధికార్ యాత్ర ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 1 వరకు బీహార్‌లో 16 రోజుల పాటు జరిగింది. దీనికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ,  తేజస్వి యాదవ్ నాయకత్వం వహించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement