ఏకంగా పోలీసు వాహనంతోనే రీల్‌! | Reels With Police vehicle video goes viral from nagarkurnool | Sakshi
Sakshi News home page

ఏకంగా పోలీసు వాహనంతోనే రీల్‌!

Apr 9 2025 3:40 PM | Updated on Apr 9 2025 5:51 PM

Reels With Police vehicle video goes viral from nagarkurnool

సోషల్‌ మీడియాలో రీల్స్‌ మోజులో విచక్షణ మర్చిపోతున్నారు.  కంటెంట్‌ కోసం, వ్యూస్‌  కోసం వాళ్లు సృష్టించా అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.  అలాంటి ఒక పిచ్చి పనికి లక్షల కొద్దీ వ్యూస్‌ రావడంతో ఇక అందరూ అదే బాటపడుతున్నారు.  ఇలా చెప్పుకుంటూ ఈ రీల్స్‌ పురాణం  చాలా పెద్దదే. తాజాగా నాగర్‌కర్నూల్‌కు చెందిన ఇద్దరు యువకులు పోస్ట్‌  చేసిన రీల్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏకంగా పోలీస్ పెట్రోలింగ్ వెహికిల్‌తోనే రీల్స్ చేశారా యువకులు. 

ఇద్దరు యువకులు పోలీసు వాహనం నడుపుతూ.. రీల్స్‌చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియోలు వివాదా స్పద మయ్యాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఈగలపెంటలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. జిల్లాలోని ఈగలపెంట పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఇన్నోవా టీఎస్‌ 09 పీఏ 4622 వాహనాన్ని మంగళవారం ఇద్దరు యువకులు నడుపుతూ రీల్స్‌ చేశారు. ఈగలపెంట పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఓ అధికారి బంధువులే.. దోమలపెంట సమీపంలోని శ్రీశైలం–హైదరాబాద్‌ జాతీయ రహదారి పక్కన రీల్స్‌ చేసినట్టు తెలుస్తోంది. కాగా ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నాగర్‌కర్నూల్‌ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement