
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో కొందరు యువతీ యువకులు రోడ్లపై విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇటువంటి ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపధ్యంలో ఈ జంటపై చర్యలు తీసుకోవాలని పోలీసులను పలువురు కోరారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా వైరల్ అయిన ఈ ఐదు సెకన్ల క్లిప్‌లో ఒక యువకుడు బైక్ నడుపుతుండగా, ఒక యువతి పెట్రోల్ ట్యాంక్‌పై అతనికి రివర్స్ పొజిషన్‌లో కూర్చుని, తన కాళ్లను అతనికి వెనుకవైపుగా ఉంచింది. నిత్యం రద్దీగా ఉండే ఎక్స్‌ప్రెస్‌వేపై వారిద్దరూ హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. అయితే, ఆ మహిళ చేతిలో హెల్మెట్ ఉంది. అక్కడి సీసీటీవీ కెమెరాలలో ఈ ఉదంతమంతా రికార్డయ్యింది.
नोएडा पुलिस ने इस "इशकजादे" का 53500 रुपए का चालान व्हीकल एक्ट में काटकर "प्रेम पत्र" घर भिजवा दिया है !! pic.twitter.com/Dw3gqS46Z8
— Sachin Gupta (@SachinGuptaUP) June 16, 2025
ఈ వీడియోను గమనించిన తాము, ఆ వాహనం నంబరు ఆధారంగా బైక్‌ను గుర్తించి మోటారు వాహనాల చట్టంలోని సంబంధిత విభాగాల కింద రూ.53,500 చలానా జారీ చేశామని నోయిడా (ట్రాఫిక్) డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లకన్ సింగ్ యాదవ్ మీడియాకు పారు. ఈ సంఘటన సెక్టార్ 39 పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందన్నారు. ప్రమాదకరమైన డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం తదితర నేరాల కింద మోటార్ వాహనాల చట్టంలోని వివిధ విభాగాల కింద పోలీసులు ఆ వాహనానికి చలానా జారీ చేశారు.
ఇది కూడా చదవండి: జనగణన నోటిఫికేషన్ జారీ.. లెక్కల ప్రక్రియ ఇదే..