
హర్యానా: యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్ (ఏజీటీఎఫ్)తనని ఎన్‌కౌంటర్ చేస్తోందని ప్రాణ భయంతో పోలీసుల నుంచి తప్పించుకు తిరగానంటూ ఓ పార్టీ ఎమ్మెల్యే రహస్య ప్రాంతం నుంచి వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో తనని అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులపై దాడులకు పాల్పడినట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు.ఇంతకీ పోలీసుల్ని తప్పించుకున్న ఎమ్మెల్యే ఎవరు?. పోలీసులు తనని ఎన్‌కౌంటర్ చేస్తారేమోనని ఎందుకు భయపడ్డాడు.
పంజాబ్‌లోని అధికార ఆప్‌కు చెందిన హర్మీత్ సింగ్ పఠాన్‌మజ్రా తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే హర్‌ప్రీత్‌పై జిరాక్‌పూర్‌కు చెందిన ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. భార్య నుంచి విడాకులు, 2011లో తనని వివాహం చేసుకోవడం, తర్వాత ప్రైవేట్ వీడియోలు తీసి బెదిరించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు హర్యానాలోని కర్నాల్ జిల్లా దబ్రి గ్రామంలోని నివాసంలో ఉన్న హర్మీత్ సింగ్‌ను అదుపులోకి తీసుకునేందుకు పటియాలా పోలీసు బృందం అక్కడికి చేరుకుంది.
పోలీసుల రాకపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే హర్‌ప్రీత్ అజ్ఞాతంలోకి వెళ్లారు. వెళ్లే సమయంలో హరీప్రత్ గ్రామస్థులు, అతని అనుచరులు పోలీసులపైకి దాడికి పాల్పడ్డారనే ఆరోపణలొచ్చాయి. ఈ క్రమంలో అజ్ఞతం నుంచి ఎమ్మెల్యే హర్‌ప్రీత్.. ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో పోలీసులు నన్ను ఎన్‌కౌంటర్ చేసేందుకు ప్లాన్ చేశారనే సమాచారం అందింది. నన్ను ఒక్కడిని ఎన్‌కౌంటర్ చేసేందుకు ఎనిమిదిమంది ఎస్పీలు, ఎనిమిదిమంది డీఎస్పీలు, ఐదుగురు ఎస్‌హెచ్‌ఓలు,ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు బిక్రమ్ బ్రార్‌లు పట్టుకునేందుకు వచ్చారు. పోలీసులంటే నాకు అపారమైన గౌరవం ఉంది. నేను వాళ్లమీద ఎటువంటి దాడులకు పాల్పడలేదని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.
ఈ ఘటనపై పాటియాలా రేంజ్ డీఐజీ కుల్దీప్ చాహల్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే హర్‌ప్రీత్‌సింగ్ కోసం ఆయన స్వగ్రామానికి వెళ్లాం. మేం వస్తున్నామనే సమాచారంతో ఆయన అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే హర్‌ప్రీత్ సింగ్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు.పాటియాలా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్‌ఛార్జ్ ప్రదీప్ బాజ్వా ఆప్ ఎమ్మెల్యే అరెస్టును ధృవీకరించారు. ఎమ్మెల్యేను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు దాడులకు పాల్పడ్డారు. రాళ్లు రువ్వారు. ప్రతిఘటించేందుకు గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలిపారు.