 
													సాక్షి,హైదరాబాద్: అడవుల్లో ఉండే చిరుత భాగ్యనగరంలోకి ఎంటరైంది. శుక్రవారం(అక్టోబర్ 18)మియాపూర్ లో చిరుత సంచరించడం సంచలనం రేపింది. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఏకంగా మియాపూర్ మెట్రో స్టేషన్ వెనుక భాగంలో చిరతు సంచరించింది.
స్థానికుల సమాచారంతో చిరుత సంచరించిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో చిరుత కోసం పోలీసులు గాలిస్తున్నారు. చిరుత సంచరిస్తున్న వీడియోను స్థానికులు ఫోన్‌లో బందించారు. 
 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
