'ఇది నీకు సిగ్గుచేటు'.. బిల్‌గేట్స్‌ ఎదుటే నిరసన (వీడియో) | Pro Palestinian Employee Interrupts Microsoft AI CEO At Company 50th Anniversary Celebration Video Viral | Sakshi
Sakshi News home page

'ఇది నీకు సిగ్గుచేటు'.. బిల్‌గేట్స్‌ ఎదుటే ఉద్యోగుల నిరసన (వీడియో)

Apr 5 2025 3:04 PM | Updated on Apr 5 2025 3:38 PM

A Pro Palestinian Employee Interrupts Microsoft AI CEO At Company 50th Anniversary Celebration Video Viral

శుక్రవారం జరిగిన 50వ మైక్రోసాఫ్ట్ వార్షికోత్సవ వేడుకలో ఉద్యోగులు నిరసన తెలిపారు. ఇజ్రాయిల్ మిలటరీకి ఏఐ టెక్నాలజీని అందిస్తుండటాన్ని వారు వ్యతిరేకించారు. మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ 'ముస్తఫా సులేమాన్' ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో ఈ పరిణామ చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ముస్తఫా సులేమాన్ ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో.. మైక్రోసాఫ్ట్ ఉద్యోగి ఇబ్తిహాల్ అబౌసాద్ వేదిక వద్దకు వచ్చి ఆయన వ్యాఖ్యలకు అంతరాయం కలిగించారు. ముస్తఫా.. ఇది నీకు సిగ్గుచేటు. ఏఐను మంచి కోసం ఉపయోగిస్తున్నామని మీరు చెబుతున్నారు. కానీ గాజా ఘర్షణ సమయంలో ఇజ్రాయెల్ మిలటరీకి ఏఐ టెక్నాలజీని అందించి.. 50వేల మంది మరణానికి కారణమైంది. మైక్రోసాఫ్ట్ మారణహోమానికి సహాయం చేసిందని అన్నారు.

నేను మీ మాటలు వింటున్నాను, థాంక్యూ అంటూ.. ఆమె మాటలకు ముస్తఫా స్పందించారు. ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్, సీఈఓ సత్య నాదెళ్ల, మాజీ సీఈఓ స్టీవ్ బాల్మెర్ కూడా ఉన్నారు.

ఇదీ చదవండి: ఉద్యోగం కోసం మూడేళ్లు: హృదయాన్ని కదిలించే పోస్ట్

ఇబ్తిహాల్ అబౌసాద్ నిరసన తెలిపిన తరువాత.. మరో ఉద్యోగి వానియా అగర్వాల్ కూడా నీరసం తెలిపారు. మైక్రోసాఫ్ట్ వార్షికోత్సవ వేడుకలో వీరు నిరసన తెలిపినందుకు వారు తమ వర్క్ అకౌంట్ యాక్సెస్ కోల్పోయినట్లు సమాచారం. బహుశా వారిని ఉద్యోగంలో నుంచి తొలగించి ఉండొచ్చని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement