
నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న మాస్ యాక్షన్ థ్రిల్లర్ 'ది ప్యారడైజ్'. దసరాతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే నాని ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ పోస్టర్లో ఇంతకు ముందెన్నడు కనిపించని విధంగా రెండు జడలతో కనిపించారు. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. డిఫరెంట్ లుక్లో నాని కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్ వీడియోను పంచుకున్నారు మేకర్స్. ఈ సీక్వెన్స్ను జైల్లో తెరెకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ ఫైట్ సీక్వెన్స్లో నాని డిప్స్ కొడుతూ కనిపించారు. 'వాడి జడల్ని ముట్టుకుంటే వాడు సర్రుమంటాడు' అనే డైలాగ్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ది స్పార్క్ ఆఫ్ ప్యారడైత్ పేరుతో ఈ సీక్వెన్స్ రాప్ వీడియోను రిలీజ్ చేశారు.
అయితే ఈ చిత్రంలో నాని సరసన డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ హీరోయిన్గా కనిపించనుందని టాక్. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయెల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎనిమిది భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలోకి రానుంది.