కొద్దిరోజుల క్రితం కేరళలో బస్సులో లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి వీడియో పోస్ట్ చేసి సామాజిక మాధ్యమాలలో అప్‌లోడ్ చేసింది. దీంతో ఇది వైరల్‌గా మారడంతో అవమాన భారంతో ఆయువకుడు బలవన్మరణానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా కేరళ పోలీసులు ఆ వీడియో పోస్ట్ చేసిన యువతిని అరెస్టు చేశారు.
గత శుక్రవారం దీపక్(42) అనే వ్యక్తి కన్నూర్ వెళ్లడానికి బస్సుఎక్కాడు. ఆసమయంలో బస్సులోనే ఉన్న శింజితా ముస్తాఫా (35) అనే మహిళ తనను దీపక్ తనను అసభ్యంగా తాకాడంటూ వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టింది. ఇది కాస్త అక్కడ వైరల్‌గా మారడంతో అవమానభారంతో ఆ దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆయువకుడి తప్పేమి లేదని యువతి ఫేమస్ కావాలనే ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని యువకుడు తరపు బంధువులు కేసు పెట్టారు.
దీంతో ముస్తాఫా పరారైంది. తాజాగా ఆమెను తన బంధువుల ఇంటివద్ద అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆమె సామాజిక మాధ్యమాలలో షేర్ చేసిన వీడియో ఎడిటడ్‌దని ఆ పూర్తి వీడియోని సైబర్ విభాగం రివవరీ చేసి చూస్తుందని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ ఘటనకు సంబంధించిన సీసీటీవీ పుటేజ్ వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై గతంలో శింజితా ముస్తాఫా స్పందిస్తూ " నేను బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు అతడు నన్ను అదేపనిగా తాకాడు. అది అపార్థంగా అనుకోకుండా జరిగింది కాదు. కావాలనే అలా చేశాడు ఇది ఖచ్చితంగా తప్పే నాకు అతను తాకడం ఇబ్బందిగా అనిపించిన తర్వాత రికార్డింగ్ చేయడం ప్రారంభించాను అయినప్పటికీ అతను తాకాడు" అని తెలిపింది.
అయితే ఈ వివాదం రెండురోజుల తర్వాత దీపక్ తన ఇంటివద్ద ఉరివేసుకొని చనిపోయాడు. దీంతో అతను చాలా అమాయకుడని అన్యాయంగా తన కొడుకుపై అపనింద వేశారని అతని తల్లిదండ్రులు రోదించారు. దీనిపై కేరళ మానవహక్కుల సంఘం సైతం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. దీనిపై సమగ్రవిచారణ జరపాలని పోలీసులను ఆదేశించింది.


