
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: అధికార మదంతో ఊగిపోతున్న కూటమి నేతలు(Kutami Leaders).. ఇప్పుడు కీచకుల్లా వ్యవహరిస్తున్నారు. తన భర్త డెత్ సర్టిఫికెట్ కోసం అర్జి పెట్టుకున్న ఓ మహిళను బీజేపీ నేత ఒకరు లైంగికంగా వేధిస్తున్న ఉదంతం విసన్నపేటలో వెలుగు చూసింది.
విసన్నపేట(Vissannapeta) పట్టణంలో టీ దుకాణంలో పని చేసే ఆదిలక్ష్మీ.. బీజేపీ మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అబ్బినేని బాబుపై సంచలన ఆరోపణలకు దిగింది. ఆయన తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ వీడియో ద్వారా ఆమె వివరాలను వెల్లడించారు .
బాధితురాలి భర్త కొద్ది రోజుల మరణించాడు. అయితే డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా.. అబ్బినేని బాబు ఆమె వద్దకు వచ్చి ఆరా తీశాడు. తనతో కొంత టైం గడిపితే డెత్ సర్టిఫికెట్ ఇప్పిస్తానంటూ అసభ్యకరంగా వ్యవహరించాడు. దీంతో ఆమె గట్టిగా తిట్టి పంపించేసింది.
ఆటైంలో అబ్బినేని బాబు తాను చెప్పినట్లు వినకపోతే డెత్ సర్టిఫికెట్ ఎలా వస్తుందో చూస్తానంటూ బెదిరించారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయం తెలిసి అబ్బినేని తప్పతాగి వచ్చి ఆమెపై బెదిరింపులకు దిగారు. ‘‘నేను ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే అంతటోడిని అని, ఎవరికీ భయపడను’’ అని మళ్లీ బెదిరించే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె తనకు న్యాయం జరగాలంటూ వీడియో ద్వారా అభ్యర్థించారు.

ఇదీ చదవండి; చంద్రబాబు కోవర్టు రాజకీయం