మరో వీడియో విడుదల చేసిన కిరణ్‌ రాయల్‌ బాధితురాలు | Janasena Kiran Royal Victim Lakshmi Released Another Video After Bail | Sakshi
Sakshi News home page

మరో వీడియో విడుదల చేసిన కిరణ్‌ రాయల్‌ బాధితురాలు

Feb 12 2025 7:21 PM | Updated on Feb 12 2025 7:49 PM

Janasena Kiran Royal Victim Lakshmi Released Another Video After Bail

కిరణ్‌ రాయల్‌ బాధితురాలు లక్ష్మి మరో వీడియో విడుదల చేశారు.

సాక్షి, తిరుపతి: కిరణ్‌ రాయల్‌ బాధితురాలు లక్ష్మి మరో వీడియో విడుదల చేశారు. ‘‘నేను జైపూర్‌ నుంచి తిరుపతికి క్షే​మంగా వస్తానన్న నమ్మకం  లేదు.. నా పిల్లలకు ఏమైనా జరిగితే కిరణ్‌ రాయలే కారణం’’ అంటూ ఆమె సెల్ఫీ వీడియో రిలీజ్‌ చేశారు. ‘‘నేను తిరుపతిలో కిరణ్‌ రాయల్‌పై ఫిర్యాదు చేశా. ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారంలో ఉన్నవాళ్లకే పోలీసులు అండగా ఉంటారా?’’ అని లక్ష్మి ప్రశ్నించారు.

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను అభ్యర్థించినా నాకు న్యాయం జరగలేదు. నేను తిరుపతికి వచ్చిన వెంటనే మరో వ్యక్తి ఉన్నాడు ఆ వీడియోను కూడా రిలీజ్ చేస్తాను’’ అని లక్ష్మి పేర్కొన్నారు. కాగా, కిరణ్‌ రాయల్‌ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ గత కొద్దిరోజులుగా న్యాయ పోరాటం చేస్తోన్న బాధితురాలు లక్ష్మిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆమెకు జైపూర్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

ఇదీ చదవండి: జనసేన కిరణ్‌ రాయల్‌కు షాక్‌

కాగా, తిరుపతి జనసేన పార్టీ ఇన్‌చార్జి కిరణ్‌ రాయల్‌ మోసాన్ని వివరిస్తూ మొదటిసారిగా లక్ష్మి విడుదల చేసిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే.. కిరణ్‌రాయల్‌ తనను బెదిరించి.. రూ.కోటికిపైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో బాధిత మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో కూడా సంచలనంగా మారింది.

సోమవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ప్రెస్‌మీట్‌ ముగిసిన వెంటనే.. జైపూర్‌ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఇవాళ బెయిల్‌ వచ్చిన తర్వాత లక్ష్మి మరో వీడియో విడుదల చేశారు.

ఇదీ చదవండి: జనసేన కిరణ్‌ రాయల్‌ బాగోతం.. వీడియో వైరల్‌
 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement