32 వీడియో లింకులను బ్లాక్‌ చేసిన యూట్యూబ్‌! | Youtube Blocked 32 Video Links Of A Protest Song In Hong Kong After Court Order, More Details Inside | Sakshi
Sakshi News home page

32 వీడియో లింకులను బ్లాక్‌ చేసిన యూట్యూబ్‌!

Published Wed, May 15 2024 2:22 PM

YouTube blocked 32 video links of a protest song in Hong Kong

ప్రముఖ ఆన్‌లైన్‌ వీడియో ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్ నిషేధిత కంటెంట్‌గా భావించే 32 వీడియో లింకులను బ్లాక్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. హాంకాంగ్‌ కోర్టు నిర్ణయానికి లోబడి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది.

చైనా-హాంకాంగ్‌ మధ్య కొన్నేళ్లుగా రాజకీయ, బౌగోళిక సమస్య కొనసాగుతోంది. హాంకాంగ్‌లో ప్రత్యేకపాలన ఉంటుంది. అక్కడి ప్రభుత్వాన్ని చైనాకు అనుకూలంగా ఉండే వారికి కట్టబెడుతారు. దాంతో స్థానిక ప్రజలనుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. అందులో భాగంగా 2019లో ‘గ్లోరీ టు హాంకాంగ్’ అనే నిరసన గీతం ప్రాచుర్యంలోకి వచ్చంది. దీన్ని నిషేధించాలని కోరుతూ హాంకాంగ్‌ అప్పీల్ కోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఆ గీతం యూట్యూబ్‌లో వైరల్‌గా మారడంతో దాన్ని తొలగించాలని తాజాగా కోర్టు ఆదేశించింది. ఫలితంగా పాటకు సంబంధించిన 32 వీడియో లింకులను తొలగిస్తున్నట్లు యూట్యూబ్‌ ప్రకటించింది. చైనా నుంచి హాంకాంగ్‌ విభజనను కోరుకుంటున్న అసమ్మతివాదులు ఆ పాటను ఉపయోగించుకోవచ్చని న్యాయమూర్తులు హెచ్చరించారు.

ఇదీ చదవండి: టీవీ రిమోట్‌ పనిచేయడం లేదా..? చిట్కా మీ కోసమే..

కోర్టు నిర్ణయంతో నిరాశ చెందినట్లు యూట్యూబ్‌ చెప్పింది. అయినప్పటికీ ఆ తీర్పును పాటిస్తామని స్పష్టం చేసింది. బుధవారం నుంచి ఇకపై యూట్యూబ్‌లో ఆ గీతం కోసం సెర్చ్‌చేస్తే ‘కోర్టు ఆర్డర్‌ వల్ల ఇందుకు సంబంధించిన కంటెంట్‌ దేశీయ డొమైన్‌లో నిషేధించడమైంది’ అనే పాప్‌అప్‌ మెసేజ్‌ వస్తుందని చెప్పింది. ఆన​్‌లైన్‌లో స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తీకరించానుకునేవారిని కట్టడి చేయడం సరికాదని, ఈ వ్యవహారానికి సంబంధించి ఇతర వర్గాలకు అప్పీల్ చేస్తామని తెలిపింది. ఇప్పటికే మానవ హక్కుల సంస్థలతో తమ భావాలను పంచుకున్నట్లు కంపెనీ పేర్కొంది.

Advertisement
Advertisement