
టాలీవుడ్ నటి మంచు లక్ష్మి దాదాపు ఐదేళ్ల తర్వాత వెండితెరపై కనిపించనుంది. ప్రస్తుతం ఆమె దక్ష (ది డెడ్లీ కాన్సిఫరిసీ) అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ చిత్రం టీజర్ విడుదల చేయగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని తన సొంత బ్యానర్ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్‌లో తెరకెక్కించారు. ఈ సినిమాకు మోహన్ బాబు, లక్ష్మీ ప్రసన్న నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి వంశీకృష్ణ మల్ల దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది.
అయితే ఇటీవల దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్-2025 వేడులకు హాజరైంది. మంచు లక్ష్మీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అక్కడే మంచు లక్ష్మీ వేదిక వద్దకు వెళ్తుండగా ఆమెతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. అదే సమయంలో ఓ అభిమాని అసభ్యకరంగా కామెంట్ చేయడంతో మంచు లక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడరా? మీకసలు సెన్స్ లేదు రాస్కెల్స్.. అంటూ మండిపడింది. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ సైతం కామెంట్ చేస్తున్నారు. ఆ తర్వాత చాలామంది అభిమానులతో సెల్ఫీలకు పోజులిచ్చింది మంచు లక్ష్మీ.
కాగా.. మంచు లక్ష్మీ నటించిన యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్‌లో సముద్రఖని, మలయాళ నటుడు సిద్దిక్, చైత్ర శుక్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మోహన్ బాబు కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా మంచు లక్ష్మీ పవర్‌పుల్ పాత్రలో కనిపించారు. లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ నుంచి పదేళ్ల తర్వాత దక్ష రూపంలో మరో చిత్రం విడుదల కానుంది. 2015లో మామ మంచు అల్లుడు కంచు మూవీ ఆ బ్యానర్ నుంచి చివరిగా విడుదలైంది.