త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'.. CH.V.S.N బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మించారు. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టీజర్ను విడుదల చేశారు. ప్రేక్షకులను మెప్పించేలా టీజర్ ఉంది. ముఖ్యంగా ప్రకాష్ చెరుకూరి అందించిన సంగీతం మరింత ఇంపాక్ట్ చూపుతుంది.
ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. 'గత కొన్ని రోజులుగా చిన్న సినిమాలన్నీ అద్భుతంగా ఆడుతున్నాయి . దీంతో మా అందరికి ఒక హోప్ వచ్చింది. సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు థియేటర్కి రావడం చాలా ఆనందంగా ఉంది. టికెట్ ధరలు తక్కువ ఉంటే ఆడియన్స్ అందరూ వచ్చి సినిమా చూస్తారని భావిస్తున్నాను. మోడరన్ లైఫ్, పాత పద్ధతిలో ఉన్న వ్యవసాయాన్ని ఎలా కలపొచ్చు అనేది ఈ సినిమాల్లో చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. చాలా ముఖ్యమైన విషయాలు ఇందులో చెప్పాం.

మనమందరం కూడా వ్యవసాయం నుంచే వచ్చాము. ఒక్కసారి మనమందరం వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని తరాలు కూడా వ్యవసాయం నుంచే వచ్చాయి. వ్యవసాయం గురించి ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతూనే సినిమా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తాం.' అని ఆయన అన్నారు.
ప్రొడ్యూసర్ అరవింద్ మాట్లాడుతూ .. 'ఈ మూవీ మంచి కంటెంట్తో పాటు హైలీ ఎంటర్టైన్ అందించేలా ఉంటుంది. ఈ కార్యక్రమానికి పల్స్ ఆఫ్ వర్కింగ్ ఫ్రొం హోం అని పెట్టాం. ఈ సినిమా పల్స్ ఏమిటో ఆడియన్స్ కి తెలియాలని. అద్భుతమైన ఎంటర్టైన్మెంట్తో పాటు మీనింగ్ ఫుల్ మెసేజ్ కూడా ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి మరింత ప్రమోషనల్ కంటెంట్ మీ ముందుకు వస్తుంది. తప్పకుండా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తాం.' అని ఆయన అన్నారు.


