ప్రముఖ సినీ హీరో రాజశేఖర్ మూవీ షూటింగ్‌లో గాయపడ్డారు. నవంబర్ 25న కొత్త సినిమా సెట్స్‌లో చిత్రీకరణ జరుగుతుండగా ఆయన ప్రమాధానికి గురయ్యారు. మేడ్చల్ దగ్గరలో యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొన్న ఆయన కాలికి గాయలయ్యాయి. తన కుడి కాలి మడమ దగ్గర గాయమయినట్లు తెలిసింది. అయితే, వెంటనే రాజశేఖర్‌ను ఆసుపత్రికి తరలించి శస్త్రచికిత్స చేయించినట్లు తన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే శస్త్ర చికిత్స విజయవంతమైందని సినీ యూనిట్ వెల్లడించింది.
రాజశేఖర్ కు కొన్ని నెలలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన తమిళ రీమేక్ మూవీ ‘లబ్బర్ పందు‘లో నటిస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్‌లో భాగంగానే రాజశేఖర్ గాయపడినట్టు సమాచారం. శర్వానంద్ బైకర్ మూవీలో కూడా ఆయన కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.


