చెప్పు విసిరిన ఘటన.. 'నన్ను నేను మర్చిపోయా!' | Woman Throws Shoe at Vairamuthu, lyricist 1st post after this Incident | Sakshi
Sakshi News home page

గేయరచయితపై చెప్పు విసిరిన ఘటన.. వైరముత్తు తొలి పోస్ట్‌

Jan 24 2026 2:58 PM | Updated on Jan 24 2026 3:03 PM

Woman Throws Shoe at Vairamuthu, lyricist 1st post after this Incident

సినీగేయరచయిత వైరముత్తుపై ఓ మహిళ చెప్పు విసిరిన ఘటన ఇటీవల కలకలం రేపింది. తమిళనాడులోని తిరుప్పూర్‌లో కొంగు కళ, సాహిత్య సంస్కృతి మండలి ప్రారంభోత్సవం జరిగింది. ఈ వేడుకలో పాల్గొనేందుకుగానూ తిరుప్పూర్‌ కలెక్టరేట్‌కు రాగా అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అదే సమయంలో అక్కడున్న ఓ మహిళ చెప్పు విసిరింది. 

తొలి పోస్ట్‌
అయితే అది వైరముత్తుపై కాకుండా మరోవైపు పడింది. వెంటనే పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. తనకు మతిస్థిమితం సరిగా లేదని తెలిపారు. ఈ ఘటన తర్వాత వైరముత్తు సోషల్‌ మీడియలో తొలిసారి ఓ పోస్ట్‌ పెట్టాడు. తిరుప్పూర్‌లో తను హాజరైన మరో కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను షేర్‌ చేశాడు. రెండువేలమంది విద్యార్థులు ఒక్కచోట చేరి చప్పట్లు కొడుతుంటే తనను తాను మర్చిపోయానన్నాడు.

గతంలో ఆరోపణలు
కాగా వైరముత్తు గతంలో మీటూ ఉద్యమ సమయంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నాడు. చాలామంది మహిళలతో వైరముత్తు అసభ్యంగా నడుచుకున్నారంటూ సింగర్‌ చిన్మయి శ్రీపాద సంచలన ఆరోపణలు చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఈ ఆరోపణలను వైరముత్తు కొట్టిపారేశాడు.

 

 

చదవండి: ప్రెగ్నెన్సీ అనుమానాలపై క్లారిటీ ఇచ్చిన బిగ్‌బాస్‌ శివజ్యోతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement