మృణాల్-ధనుష్ పెళ్లి చేసేశారు.. వీడియో వైరల్ | Dhanush Mrunal Thakur Wedding Video Ai Details | Sakshi
Sakshi News home page

Dhanush Mrunal: ఇది మరీ టూమచ్.. పెళ్లికి అతిధులుగా కోలీవుడ్ స్టార్స్

Jan 24 2026 3:42 PM | Updated on Jan 24 2026 3:48 PM

Dhanush Mrunal Thakur Wedding Video Ai Details

తమిళ స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకుర్ ప్రేమలో ఉన్నారని.. ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే కానుకగా పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కొన్నిరోజుల ముందు షాకింగ్ రూమర్స్ వచ్చాయి. ఇవి నిజమని చాలామంది నమ్మేశారు కూడా. కానీ వీటిలో ఎలాంటి నిజం లేదని స్వయానా మృణాల్ టీమ్ క్లారిటీ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. దీంతో రిలాక్స్ అవుతారనుకుంటే ఇప్పుడు ఏకంగా ధనుష్-మృణాల్ పెళ్లి చేసేశారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అయిపోతోంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ 'సర్వం మాయ'.. తెలుగులో స్ట్రీమింగ్)

రీసెంట్ టైంలో ఏఐ(కృత్రిమ మేధ) వినియోగం చాలా పెరిగిపోయింది. తమకు నచ్చిన ఫొటోలు, వీడియోలని యూజర్స్ తయారు చేసుకుంటారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఓ నెటిజన్.. ఇలానే ధనుష్-మృణాల్ పెళ్లి జరిగినట్లు, ఈ కార్యక్రమానికి తమిళ ఇండస్ట్రీకి చెందిన దళపతి విజయ్, అజిత్, త్రిష, అనిరుధ్, శ్రుతి హాసన్, దుల్కర్ సల్మాన్ తదితరులు హాజరైనట్లు కూడా సృష్టించారు. ఇది ఫేక్ వీడియోనే అయినప్పటికీ యూజర్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తుండటం విశేషం.

ఈ పెళ్లి రూమర్స్ రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. రజనీకాంత్ కూతురు ఐశ్వర్యని ధనుష్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు కొడుకులు కూడా పుట్టారు. కానీ వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతానికైతే ధనుష్ ఒంటరిగానే ఉంటున్నాడు. రీసెంట్ టైంలో మృణాల్ చేసిన సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ జరిగితే వీటిలో ధనుష్ కనిపించడం, డేటింగ్ రూమర్స్ రావడానికి కారణమైంది. ఈ క్రమంలోనే పెళ్లి గాసిప్స్ కూడా వచ్చాయి. అవి అబద్ధమని తెలిసినప్పటికీ సోషల్ మీడియాలో ఈ ఏఐ వీడియోలు వైరల్ అయిపోతున్నాయి.

(ఇదీ చదవండి: మెగా హీరో పాన్ ఇండియా సినిమాలో మృణాల్ ఐటమ్ సాంగ్?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement