మలయాళ హీరోయిన్ మాళవిక మోహనన్.. మలయాళంతోపాటు సమానంగా తమిళంలోనూ సినిమాలు చేసింది. కోలీవుడ్‌లో తను నటించిన మాస్టర్, పేట, తంగలాన్ చిత్రాలు తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇటీవల ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం కార్తీ హీరోగా నటిస్తున్న సర్దార్ 2 మూవీలో యాక్ట్ చేస్తోంది.

డైలాగులు బేఖాతరు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాళవిక చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఆమె మాట్లాడుతూ.. చాలాకాలం కిందట సంగతి ఇది. తెలుగు, తమిళంలో కొందరు హీరోయిన్లు డైలాగులను అసలు పట్టించుకునేవారే కాదు. ఒక సన్నివేశంలో బాధగా కనిపించాలంటే ఏడుపు ముఖం పెట్టి ఒకటి, రెండు, మూడు, నాలుగు అని లెక్కపెట్టేవారు. అంతే..! ఆవేశం, కోపం కలగలిపిన సీన్లలో ఏబీసీడీ అనే అక్షరాలను చదువుతూ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చేవారు.
మమ అనిపించేవారు
ఏబీసీడీ అన్న అక్షరాలను పదేపదే చదువుతూ ఉంటే పెదాలు కలుస్తూ ఉంటాయి. ఆ లిప్ సింక్ వల్ల డబ్బింగ్‌లో చెప్పే డైలాగ్స్‌కు సరిగ్గా సరిపోయేవి. కెరీర్ మొత్తం వాళ్లిలాగే నెట్టుకొచ్చారు. నేనైతే వారిలా అస్సలు చేయలేను అని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్‌పై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర భాషా నటుల్ని తీసుకొచ్చి పెడితే ఇలాగే ఉంటుందని కొందరు అంటుంటే.. మాస్టర్ మూవీలో నిన్ను ట్రోల్ చేసిందెందుకో మర్చిపోయావా? అని మరికొందరు మాళవికపై సెటైర్లు వేస్తున్నారు.
#MalavikaMohanan Acting in Master was trolled by all with her expression
But She Commenting on others pic.twitter.com/tASuISbGrh— SillakiMovies (@sillakimovies) January 21, 2026


