దళపతి రేంజ్‌కు 'అల్లు అర్జున్'.. బిగ్‌ లైనప్‌తో ప్లాన్‌ | Allu Arjun Next target Tamil Nadu movie Industry And Vijay | Sakshi
Sakshi News home page

దళపతి రేంజ్‌కు 'అల్లు అర్జున్'.. బిగ్‌ లైనప్‌తో ప్లాన్‌

Jan 17 2026 6:28 PM | Updated on Jan 17 2026 6:48 PM

Allu Arjun Next target Tamil Nadu movie Industry And Vijay

అల్లు అర్జున్‌ పుష్పలో "ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా" అనే పాట తన నిజ జీవితానికి బాగా సెట్‌ అవుతుంది అని చెప్పొచ్చు. బన్నీ సినిమా విడుదలవుతుంది అంటే చాలు.. అందరికీ తెలిసిన ఒక వర్గం తనను కిందకు లాగేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది.  అయితే, బన్నీ కూడా అంతే రేంజ్‌లో "ఎవడ్రా ఎవడ్రా నువ్వు ఇనుమును నేను, నను కాల్చితే కత్తి అవుతాను" అంటూ తనను ట్రోల్‌ చేసే వారి గుండెల్లో దడ పుట్టిస్తాడు. టాలీవుడ్‌లో తన ఫ్యాన్స్‌ బేస్‌ చాలా బలంగానే ఉంది. ఇప్పుడు తన చూపు ఇతర ఇండస్ట్రీల మీద ఉంది. ‘ఆర్య’ సినిమా తర్వాత మలయాళంలో మల్లు అర్జున్‌ అయ్యాడు. పుష్ప సినిమాతో బాలీవుడ్‌కు తన మార్కెట్‌ సత్తా చూపాడు. ఇప్పుడు అట్లీ, లోకేశ్‌ కనగరాజ్‌ మూవీస్‌తో తమిళ పరిశ్రమపై కన్నేశాడు. తన ప్లాన్‌ వర్కౌట్‌ అయితే, తమిళ్‌లో బిగ్‌స్టార్‌గా పాతుకుపోతాడు. అందుకే ఇప్పుడు వరుసగా తమిళ టాప్‌ దర్శకులతో ప్రాజెక్ట్‌లు మొదలుపెట్టాడనిపిస్తుంది.

దళపతి బాయ్స్‌తో అల్లు అర్జున్‌
దళపతి విజయ్‌ బాయ్స్‌గా అట్లీ, లోకేశ్‌ కనగరాజ్‌లకు ఇమేజ్‌ ఉంది. బిగిల్‌, మెర్సిల్‌, తేరి చిత్రాలతో విజయ్‌కి అట్లీ హిట్స్‌ ఇస్తే.. లియో, మాస్టర్‌ మూవీస్‌తో లోకేశ్‌ తన మార్క్‌ చూపించాడు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి అల్లు అర్జున్‌తో వరుసగా సినిమాలు చేస్తుండటంతో విజయ్‌ ఫ్యాన్స్‌ కన్ను అల్లు అర్జున్‌ మీద పడింది. లోకేశ్‌ తన నెక్ట్స్‌ మూవీ బన్నీతో అని చెప్పగానే విజయ్‌ ఫ్యాన్స్‌ రంగంలోకి దిగారు. విజయ్‌, అల్లు అర్జున్‌ల ఏఐ ఫోటోలను క్రియేట్‌ చేసి సోషల్‌మీడియాలో పంచుకుంటున్నారు.

చెన్నైలో జరిగిన పుష్ప-2 ఈవెంట్‌లో  బన్నీ  తమిళంలోనే మాట్లాడి వారి ప్రేమను పొందాడు. తమిళ ప్రజలకు కావాల్సింది కూడా అదే.. వారి భాషలో మాట్లాడే హీరోలను తప్పకుండా అక్కున చేర్చుకుంటారు. కన్నడకు చెందిన రజనీకాంత్‌కు తమిళనాట ఎలాంటి ఆదరణ ఉందో తెలిసిందే.. ఇప్పుడు అల్లు అర్జున్‌ కూడా అదే బాటలో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది.

అల్లు అర్జున్‌కు తమిళనాడులో సానుకూలత
ప్రస్తుతం అల్లు అర్జున్ చూపు  తమిళనాడుపై ఉంది. కోలీవుడ్‌లో దళపతి విజయ్ సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల వైపు వెళ్తున్నారు. రజనీకాంత్ వయసు కారణంగా రాబోయే రోజుల్లో సినిమాలు చేసే ఛాన్స్‌ తక్కువగానే ఉండొచ్చు. ఆపై  తమిళ మరో బిగ్‌ హీరో అజిత్ కూడా సినిమాలపై ఫోకస్ తగ్గించి..  కార్‌ రేసింగ్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఈ ముగ్గురి తర్వాత ఏర్పడుతున్న ఆ స్పేస్‌ను ఉపయోగించుకునేందుకు పక్కా వ్యూహంతో అల్లు అర్జున్ ముందుకు వెళ్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. దళపతి విజయ్‌ మెచ్చిన దర్శకులతో బన్నీ సినిమాలు చేస్తున్నాడు కాబట్టి తన ప్లాన్‌ సక్సెస్‌ అవుతుందనే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటికే కేరళలో అల్లు అర్జున్‌కు టాప్‌ ఇమేజ్‌ ఉంది. ఇదే క్రమంలో తమిళనాడులో కూడా తన ప్లాన్‌ వర్కౌట్‌ అయితే సౌత్‌ ఇండియాలో బన్నీకి సినిమాలకు  బిగ్గెస్ట్‌ మార్కెట్‌ ఏర్పడుతుంది.

బిగ్‌ లైనప్‌ సినిమాలతో ప్లాన్‌
అల్లు అర్జున్‌ చేతిలో రాబోయే సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్‌తో పాటు టాప్‌ దర్శకులతోనే ఉన్నాయి. అట్లీ, లోకేశ్‌ కనగరాజ్‌, త్రివిక్రమ్‌, సందీప్‌ రెడ్డి వంగా, సుకుమార్‌ ఇలా వరుసగా పేరున్న డైరెక్టర్స్‌తో లైనప్‌ ఉంది. ఆపై తను ఎంచుకున్న స్టోరీలు కూడా చాలా బలంగానే ఉన్నాయి. అట్లీ సినిమా హిట్‌ కొడితే చాలు.. సౌత్‌ ఇండియాలో తన మార్కెట్‌ పునాది బలంగా పడుతుంది. బాలీవుడ్‌లో ఎటూ ఖాన్‌ల మూవీస్‌కు పోటీగా బన్నీ మార్కెట్‌ ఉంది. ముఖ్యంగా బీహార్‌, రాజస్థాన్‌, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో   బన్నీ సినిమాలకు భారీ క్రేజ్‌ ఉంది. ఆపై తన ఫ్యూచర్‌ సినిమాల లైనప్‌ మరింత బలంగా ఉంది కాబట్టి ఇండస్ట్రీలో తన మార్క్‌ ఏంటో అల్లు అర్జున్‌ చూపించబోతున్నాడని తెలిసిపోతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement